Harmanpreet Kaur Controversy : మరీ ఓవర్‌గా అనిపించింది.. ఇది చాలదు.. 100 శాతం.. భార‌త్ విష‌యంలోనే కాదు..

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్.. అంపైర్ త‌న‌ను ఎల్బీగా ప్ర‌క‌టించ‌డంతో ఆగ్ర‌హంతో ఊగిపోయింది. వికెట్ల‌ను బ్యాట్‌తో కొట్టింది. అంపైర్ నిర్ణ‌యం పై బాహాటంగా అసంతృప్తిని వ్య‌క్తం చేసింది.

Harmanpreet Kaur Controversy : మరీ ఓవర్‌గా అనిపించింది.. ఇది చాలదు.. 100 శాతం.. భార‌త్ విష‌యంలోనే కాదు..

Afridi On Harmanpreet Controversy

Harmanpreet Kaur – Shahid Afridi : బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ).. అంపైర్ త‌న‌ను ఎల్బీగా ప్ర‌క‌టించ‌డంతో ఆగ్ర‌హంతో ఊగిపోయింది. వికెట్ల‌ను బ్యాట్‌తో కొట్టింది. అంపైర్ నిర్ణ‌యం పై బాహాటంగా అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు గాను హ‌ర్మ‌న్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్మ‌న్ చేసిన ప‌నిని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబ‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Toby Roland Jones : ఎంత దుర‌దృష్ట‌మో.. బంతి ఏమో సిక్స‌ర్‌గా వెళ్లింది.. కానీ బ్యాట‌ర్‌ ఔట్.. ఒక్క ప‌రుగు రాలే

ఇప్పుడు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది(Shahid Afridi ) కూడా హ‌ర్మ‌న్ ను విమ‌ర్శించాడు. ఆమె చేసింది అతిగా అనిపించింద‌ని అన్నాడు. అంత‌గా రియాక్ట్ కాన‌వ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఫీజులో 75 శాతం జ‌రిమానాగా విధించింది స‌రిపోద‌ని 100 శాతం మ్యాచ్ ఫీజును ఫైన్‌గా వేయాల‌ని సూచించాడు. టీమ్ఇండియా విషయంలోనే కాదని, గతంలోనూ ఇలాంటివి చాలా సార్లు జ‌రిగాయ‌న్నాడు.

Harmanpreet Kaur : హ‌ర్మ‌న్ వ్యాఖ్య‌లు.. క‌ల‌త చెందిన బంగ్లా కెప్టెన్‌.. ఫోటో దిగ‌కుండా జ‌ట్టుతో క‌లిసి..

అయితే మ‌హిళ‌ల క్రికెట్ లో ఇలాంటివి చాలా అరుదుగా చూస్తుంటామ‌ని, ఇది చాలా ఎక్కువగా అనిపించింద‌ని అఫ్రిది అన్నాడు. ఐసీసీ నిర్వహించిన ఓ టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. కాగా హర్మన్‌కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లుగా భావించ‌వ‌చ్చునన్నాడు. సాధార‌ణంగా క్రికెట్‌లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చున‌ని, అయితే అది నియంత్రణ‌తో కూడిన దూకుడు అయి ఉండాలన్నాడు.

Harmanpreet Kaur : భార‌త కెప్టెన్‌కు ఐసీసీ షాక్‌.. రెండు మ్యాచుల నిషేదం.. ఎందుకంటే..?

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం హ‌ర్మ‌న్ రెండు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొంటొంది. దీంతో రానున్న ఆసియా క్రీడ‌ల్లో తొలి రెండు మ్యాచుల్లో ఆమె బ‌రిలోకి దిగే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో జ‌ట్టును స్మృతి మంధాన న‌డిపించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ప‌లువురు భార‌త మాజీ క్రికెట‌ర్లు సైతం హ‌ర్మ‌న్ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బీసీసీఐ సైతం హ‌ర్మ‌న్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.