Netflix Password Sharing : భారత్‌లో నెట్‌‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు.. ఈ ప్లాన్లతో ఫ్రీ మెంబర్‌షిప్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిషేధించింది. ఇప్పుడు, వినియోగదారులు ఒకే ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులతో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను షేర్ చేసుకోవచ్చు.

Netflix Password Sharing : భారత్‌లో నెట్‌‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు.. ఈ ప్లాన్లతో ఫ్రీ మెంబర్‌షిప్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Netflix ends password sharing in India, but you can get membership for free

Netflix Password Sharing : ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, నెట్‌ఫ్లిక్స్ (Netflix) బాలీవుడ్, హాలీవుడ్, ప్రాంతీయ, ఏసియన్ డ్రామాలతో సహా అనేక రకాల OTT కంటెంట్‌ను అందిస్తుంది. అయితే, ఈ కంటెంట్‌ను యాక్సెస్ చేయడం కొంతమందికి ఖరీదైనది కావచ్చు. ప్రత్యేకించి Wi-Fi మొబైల్ ప్లాన్‌ల వంటి ఇతర రీఛార్జ్‌ల నెలవారీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే… పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు సొంత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయడం, చెల్లించడం తప్పనిసరి చేసింది.

స్నేహితుల లేదా కుటుంబ సభ్యుల అకౌంట్ల షేరింగ్ విధానాన్ని నిలిపివేసింది. ఇప్పుడు, ఒక ఇంటిలోని యూజర్లు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ను ఒక అకౌంటుతో మాత్రమే యాక్సస్ చేయగలరు. కచ్చితంగా చెప్పాలంటే.. నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ ఇప్పుడు యూజర్లు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను ఒకే ఇంటిలో నివసించే వ్యక్తులతో షేర్ చేసేందుకు మాత్రమే అనుమతిస్తుంది. అయినప్పటికీ, OTT ఛానెల్‌ల మల్టీ బిల్లుల నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేయడానికి Reliance Jio, Airtel వంటి టెలికాం ఆపరేటర్లు నెట్‌ఫ్లిక్స్ (Netflix)కి ఉచిత సభ్యత్వాలతో కాలింగ్, డేటా బెనిఫిట్స్ వంటి అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారులకు OTT కంటెంట్‌ని యాక్సెస్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా తక్కువ ఖర్చు అవుతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS, అదనపు ప్రయోజనాలతో వినియోగదారులు ప్రత్యేక మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు ఖర్చు చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌లో తమకు ఇష్టమైన షోలు, మూవీలను ఆస్వాదించవచ్చు. మీరు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్లతో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తుంటే.. ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్లతో కూడిన జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Honor 90 Launch : హానర్ మళ్లీ భారత్‌కు వచ్చేస్తోంది.. 200MP కెమెరాతో హానర్ 90 కొత్త ఫోన్ లాంచ్ ఎప్పుడంటే?

ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్‌తో జియో పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్లను అందిస్తుంది. రిలయన్స్ జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్లతో అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది.

జియో రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : రిలయన్స్ జియో 100GB డేటా, గరిష్టంగా 3 కుటుంబ సిమ్‌లు, ప్రతి సిమ్‌తో నెలకు అదనంగా 5GB, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అంతేకాకుండా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇతర Jio ప్లాన్‌ల మాదిరిగానే, వినియోగదారులు JioTV, JioCinema, JioCloudతో సహా జియో యాప్‌లకు ఉచిత యాక్సస్ పొందవచ్చు.

జియో రూ. 1,499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్లతో పాటు మొత్తం 300GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉంటాయి. అదనంగా, ఈ ప్లాన్ ఎంపిక చేసిన నగరాల్లో అంతర్జాతీయ రోమింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ముఖ్యంగా, అదనపు SIM కార్డ్‌లతో కూడిన ఫ్యామిలీ ప్లాన్లనుఅందించదు. అయితే, రెండు ప్లాన్‌లతో యూజర్లు Jio 5G నెట్‌వర్క్‌లో నివసిస్తున్నట్లయితే.. 5G సపోర్టు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే 5G డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు JioFiber కనెక్షన్‌ని కలిగి ఉంటే.. రూ. 1499 ప్లాన్ అంతకంటే ఎక్కువ ఉన్న నెట్‌ఫ్లిక్స్, OTT ఛానెల్‌లకు ఫ్రీ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

Netflix ends password sharing in India, but you can get membership for free

Netflix Password Sharing  : password sharing in India, but you can get membership for free

ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్‌తో  ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్లతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ మొత్తం రెండు పోస్టుపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. అందులో ఒక పోస్టుపెయిడ్ ప్లాన్ రూ. 1199తో పాటు రూ. 1499 పోస్టుపెయిడ్ ప్లాన్ ద్వారా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఈ పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 150GB డేటా రోల్‌ఓవర్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : అదనపు డేటా కోసం చూసే యూజర్లు రూ. 1,499 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్లతో పాటు 200GB అందిస్తుంది.

Read Also : Samsung Galaxy Tab S9 Series : S పెన్‌తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?