Tollywood Stars : మొన్న బన్నీ, పవన్ కళ్యాణ్.. నేడు చిరంజీవి.. ఫిలిం ఇండస్ట్రీకి రండి.. ఇండస్ట్రీకి ఆహ్వానం పలుకుతున్న స్టార్స్..

బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది స్టార్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా రావొచ్చు, ట్యాలెంట్ ఉంటే ఇక్కడ కచ్చితంగా సక్సెస్ అవుతారు, రావాలనుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రండి అంటున్నారు.

Tollywood Stars : మొన్న బన్నీ, పవన్ కళ్యాణ్.. నేడు చిరంజీవి.. ఫిలిం ఇండస్ట్రీకి రండి.. ఇండస్ట్రీకి ఆహ్వానం పలుకుతున్న స్టార్స్..

Chiranjeevi Pawan Kalyan Allu Arjun and some other Tollywood Stars welcomes new Talent into Film Industry

Tollywood Stars : ఇటీవల స్టార్ హీరోలు, సీనియర్ ఆర్టిస్టులు కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్న సినిమాల ఈవెంట్స్ కు వెళ్తూ, సాంగ్స్, ట్రైలర్ లాంచ్ లు చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు. స్టార్స్ సైతం కొత్తవాళ్ళ కోసం వస్తున్నారు. ఇక పలువురు స్టార్స్ మరో అడుగు ముందుకేసి కొత్తవాళ్ళని సినిమా ఇండస్ట్రీకి రండి అని ఆహ్వానిస్తున్నారు.

ఇటీవల బేబీ(Baby) సినిమా సక్సెస్ ఈవెంట్ లో బన్నీ(Bunny) మాట్లాడుతూ.. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రండి. వైష్ణవి లాంటి తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి. ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కొరత చాలా ఉంది. పక్క స్టేట్స్ నుంచి ఆర్టిస్టులని తెచ్చుకుంటున్నాం. కొత్తవాళ్లు హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఏ ఏజ్ అయినా పర్లేదు ఇండస్ట్రీకి రండి. అందరూ మీకు స్వాగతం పలుకుతారు అని అన్నారు.

ఇక బ్రో(Bro) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్(Pawan kalyan) మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవ్వరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. రండి, వచ్చి కష్టపడండి. ట్యాలెంట్ ఉన్నవాళ్లకు ఇండస్ట్రీ ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంది. కొత్త కొత్త వాళ్ళు ఎంతోమంది ఇటీవల వచ్చి సక్సెస్ లు సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి అని అన్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా భోళా శంకర్(Bholaa Shankar) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ పవన్ చెప్పినట్టు ఏ ఒక్కరి సొత్తు కాదు. చాలా మంది యంగ్ ట్యాలెంట్ వస్తున్నారు. ఇటీవల చిన్న సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. కొత్త కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఇక నా అభిమానులు, నన్ను చూసి ఇన్‌స్పైర్ అయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య సక్సెస్ సాధిస్తున్నారు. ఇంట్రెస్ట్, ట్యాలెంట్ ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీకి రండి. అందరూ ఫిలిం ఇండస్ట్రీకి రండి అని అన్నారు.

ఇలా బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది స్టార్స్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలుగు ఇండస్ట్రీకి ఎవరైనా రావొచ్చు, ట్యాలెంట్ ఉంటే ఇక్కడ కచ్చితంగా సక్సెస్ అవుతారు, రావాలనుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రండి అంటున్నారు. ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ యూనియన్ కూడా కొత్త వాళ్ళకి ఆహ్వానం పలికింది. వందల మంది డ్యాన్సర్స్ కి అవకాశం ఉంది, రండి అని ఆడిషన్స్ కూడా పెట్టారు.

Bholaa Shankar : రెండేళ్లుగా భోళా శంకర్ షూటింగ్.. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారో తెలుసా?

ఇది టాలీవుడ్ కి మంచి పరిణామమే. అయితే ఇలా అందరూ చెప్పడానికి రెండు కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల మన టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా థియేటర్ సినిమాలే కాకుండా ఓటీటీలకు, యూట్యూబ్ లకు సినిమాలు, సిరీస్ లు అంటూ అవకాశాలు చాలా పెరిగాయి. దీంతో కొన్ని చోట్ల సరైన ట్యాలెంట్ లేక పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకుంటున్నారు. దీంతో ఇక్కడి వాళ్ళకి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్తవాళ్లు వస్తారు, బడ్జెట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది అని భావిస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. అలాగే ఇండస్ట్రీ కొంతమంది కుటుంబాల చేతుల్లోనే ఉందని, ఆ కుటుంబాల నుంచి చాలా మంది వస్తున్నారని, వాళ్ళు ఎవరిని రానివ్వరని అపవాదు ఎప్పట్నుంచో ఉన్నా ఇటీవల మళ్ళీ ఇది వినిపిస్తుంది. ఆ అపవాదు పోగొట్టుకోవడానికి కూడా ఇలా అంటున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కొత్త ట్యాలెంట్ వచ్చి మంచి మంచి సినిమాలు, సిరీస్ లు వస్తే అది టాలీవుడ్ కి మంచి పరిణామమే.