10 years Girl Marriage : పెళ్లి చేయమంటూ 10 ఏళ్ల చిన్నారి మారాం, చేసిన 12 రోజులకే మృతి .. వింత కోరిక వెనుక పెను విషాదం

వేడుక వెనుక విషాదం అంటే ఇదేనేమో. 10 ఏళ్ల చిన్నారి చాక్లెట్ల కోసం ఐస్ క్రీముల కోసం మారాం చేస్తుంది. కానీ ఓ పాప మాత్రం తనకు పెళ్లి చేయమని మారాం చేసింది. అమ్మానాన్నలు కూడా పెళ్లి చేశారు. కానీ వేడుక ముచ్చట తీరకుండానే విషాదం..

10 years Girl Marriage : పెళ్లి చేయమంటూ 10 ఏళ్ల చిన్నారి మారాం, చేసిన 12 రోజులకే మృతి .. వింత కోరిక వెనుక పెను విషాదం

10 years cancer girl Marriage

10 years cancer girl Marriage : ఆ పాప వయస్సు 10 ఏళ్లు. ఈ వయస్సులో ఎవరైనా షికార్లకు తీసుకెళ్లమంటారు.చాక్లెట్లు,ఐస్ క్రీములు కావాలని మారాం చేస్తారు. కానీ ఈ పాప మాత్రం తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడిగేది.అంతేకాదు పేచీ పెట్టేది. అది విన్న తల్లిదండ్రులు కోప్పడేవారు కాదు. ఆ పాప అడిగినట్లే పెళ్లి చేశారు. అదేంటీ చిన్నపిల్ల ఏదో సరదాకో..తెలియకో అలా అడిగితే చిన్నపిల్లకు పెళ్లి చేసేస్తారా..? ఇది మరీ విడ్యూరంగా ఉందే అనుకోవచ్చు. కానీ దీని వెనుక ఓ విషాదం ఉంది. పట్టుమని పదేళ్లు కూడా పూర్తి కానీ తమ చిట్టితల్లికి క్యాన్సర్ అని ఎన్నో రోజులు బతకదని తెలిసిన ఆ తల్లిదండ్రులు తన బిడ్డ కోరినట్లుగా అదే ఆఖరి కోరికగా భావించి పెళ్లి చేశారు. పెళ్లిలో తమ బిడ్డ చిరునవ్వులు చూసి ఓ పక్క ఆనందం..మరోపక్క దు:ఖంతో కుమిలిపోయారా అమ్మానాన్నలు..ఆ ఆనందం కూడా ఆ చిన్నారి మోములో ఎన్నో రోజులు నిలవలేదు. తను కోరినట్లుగానే పెళ్లి చేసుకున్న పట్టుమని 15రోజులు కూడా పూర్తికాకుండానే చనిపోయింది.

Brazil : మద్యం తాగుతు కూర్చున్న తండ్రి, విమానం నడిపిన 11 ఏళ్ల కొడుకు .. ప్రమాదంలో ఇద్దరు మృతి

అమెరికాలోని ఉత్తర కరోలినాలోని (North Carolina)అలీనా(Alina), ఆరోన్‌ ఎడ్వర్డ్స్‌ల (Aaron Edwards)దంపతులకు ఎమ్మా ఎడ్వర్డ్స్‌ (Emma Edwards)10ఏళ్ల కూతురు ఉంది. ఎమ్మాకు క్యాన్సర్‌ సోకింది. బిడ్డను బతికించుకోవటానికి వారు చేయని ప్రయత్నమంటూ లేదు. ఖరీదైన వైద్యం చేయించారు. కానీ కొన్ని రోజులకంటే ఎక్కువ జీవించలేదని డాక్టర్లు చెప్పటంతో గుండెలు పగిలిపోయాయి ఆ తల్లిదండ్రులకు. వేరే దారిలేదు. ఉన్న కొన్ని రోజుల్లు కూతుర్ని సంతోషంగా ఉంచాలనుకున్నారు. తమ కుమార్తె ఎందుకో గానీ తనకు పెళ్లి చేయమని గతంలో పలుమార్లు అడుగుతుండేది. దాన్ని వారు ఏదో సరదాగా అంటోందని నవ్వుకునేవారు. కానీ ఎమ్మా మాత్రం ఎందుకో పదే పదే తనకు పెళ్లి చేయమని అడుగుతుండేది. అదే విషయాన్ని నిజం చేయాలనుకున్నారు.

నాకు పెళ్లి కావాలంటూ ఎప్పుడూ చెప్పే ఆమె మాటలను నిజం చేయాలనుకున్నారు. కానీ చిన్నపిల్లను ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తారు….? పైగా క్యాన్సర్..కొన్ని రోజుల్లో చనిపోబోతోంది. ఈ విషయం తెలిసి ఎవ్వరు ముందుకు రారు అనుకున్నారు. కానీ ఎమ్మాకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు వారి మదిలో మెదిలాడు. తమ కూతురు కోసం స్నేహితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఎమ్మా పరిస్థితి తెలుసు. దాంతో వారి అంగీకరించారు. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి ఎమ్మా స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఎడ్వర్డ్స్ కుటుంబానికి అండగా నిలిచారు. తమవంతు సాయం అందించారు. బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచారు.

అలా గత నెల అంటే జూన్‌ 29న బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరికి నమూనా వివాహాన్ని (Model marriage)ఘనంగా జరిపించారు. పెళ్లిలో ఎమ్మా నీరసంగా కనిపించినా సంతోషంగానే ఉంది. అలా పెళ్లి జరిగిన 12 రోజులకే పరిస్థితి విషమించి ఆ చిన్నారి కన్ను మూసింది. కూతురు మరణంతో ఆ తల్లిదండ్రుల దు:ఖానికి అంతులేదు.కానీ తమ బిడ్డ చివరి కోరిక తీర్చగలిగాం..ఆ మాత్రం సంతోషాన్నైనా ఇవ్వగాం అని వారు భావిస్తున్నారు.

Italy Government : రాత్రి వేళల్లో ఫుల్‌గా మద్యం సేవిస్తే.. క్యాబ్‌లో ఉచితంగా ఇంటికి.. సరికొత్త పథకం ..

ఓ పక్క బిడ్డను కోల్పోయిన విషాదంలో ఉన్న ఎమ్మా తల్లి మాట్లాడుతు..‘‘10ఏళ్ల పిల్లలకు సాధారణంగా డిస్నీల్యాండ్‌ వెళ్లాలని..లేదా మరేదైనా సరదా కోరికలు ఉంటాయి. కానీ నా కుమార్తె మాత్రం పెళ్లి చేసుకుంటానని మారాం చేసేది. అందుకే చివరి రోజుల్లో అయినా తనను సంతోషంగా ఉంటానికి సరదా పద్ధతిలో ఇద్దరి పెళ్లితంతును జరిపించాం’ అని దుఃఖాన్ని దిగమింగుకుంటూ అలీనా చెప్పుకొచ్చారు. తమ కళ్లముందే తమ బిడ్డలు వెళ్లి పోవటం ఏ తల్లిదండ్రులకైనా అంతకుమించిన దు:ఖం ఉండదు కదా..అంటున్నారు నెటిజన్లు.