Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఇలా ఉంటుంది.. ఫొటోలు విడుదల చేసిన చంద్రయాన్-3

చంద్రయాన్-3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వొచ్చని అంటున్నారు. ల్యాండర్ "డీబూస్ట్" అయిన తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌ను వేరు చేసే కసరత్తును త్వరలో ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.

Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఇలా ఉంటుంది.. ఫొటోలు విడుదల చేసిన చంద్రయాన్-3

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చంద్రుని చిత్రాలను ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి నిరంతరం విడుదల చేస్తోంది. ఇంతలో, ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చంద్రయాన్ -3 ల్యాండర్ ఇమేజ్ కెమెరా ద్వారా తీసిన రెండు చిత్రాలను పంచుకుంది.

YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?

చంద్రుడి తాజా చిత్రాలతో పాటు భూమికి సంబంధించిన చిత్రాన్ని కూడా తాజాగా వెల్లడించారు. వాస్తవానికి, చంద్రయాన్-3 చంద్రుడు, భూమి చిత్రాలను పంపింది. భూమికి చెందిన ఫొటోలో ఎక్కడో సూర్యరశ్మి ఉంది, మరెక్కడో నీడ ఉంది. ఇది కాకుండా, చంద్రుని చిత్రంలో గుంతలు కనిపించాయి. ఈ గుంతలు కొన్ని చోట్ల పెద్దవిగానూ, కొన్ని చోట్ల చిన్నవిగానూ ఉన్నాయి. ఈ చిత్రంలో చంద్రుడి మీద చాలా చోట్ల చీకటిగా కనిపిస్తోంది. అదేవిధంగా భూమి చిత్రంలో కూడా కొన్ని ప్రదేశాలలో చాలా చీకటిగా ఉంది. కానీ భూమి, చంద్రుని మధ్య ఉన్న నలుపు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.

MP Arvind : కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేయాలి : ఎంపీ అరవింద్ సవాల్

చంద్రయాన్-3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వొచ్చని అంటున్నారు. ల్యాండర్ “డీబూస్ట్” అయిన తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌ను వేరు చేసే కసరత్తును త్వరలో ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఇది వాహనం వేగాన్ని తగ్గించే ప్రక్రియ. దీని తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ ఉంటుందని ఆయన ఈ సమాచారం ఇచ్చారు. ఇంతలో అన్నీ విఫలమైతే ఏ సెన్సార్లు పనిచేయకపోతే అది (విక్రమ్) చంద్రుడిపై ల్యాండ్ అవుతుందట. ఎలాంటి సాయం లేకుండా ల్యాడయ్యేలా రూపొందించినట్లు సోమనాథ్ తెలిపారు.