Bholaa Shankar – Jailer : వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు సృష్టించిన సినిమాలు.. అదేంటో తెలుసా..?

వందేళ్ల సినిమా చరిత్రలో గత వారం రిలీజ్ అయిన సినిమాలు సరికొత్త రికార్డుని సృష్టించినట్లు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. అదేంటో తెలుసా..?

Bholaa Shankar – Jailer : వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు సృష్టించిన సినిమాలు.. అదేంటో తెలుసా..?

Bholaa Shankar Jailer Gadar 2 OMG2 sets new record in 100 years of cinema

Bholaa Shankar – Jailer : బాహుబలి, RRR చిత్రాలతో ఇండియన్ సినిమాల మార్కెట్ పరిధి పెరిగిపోయింది. భాష, ప్రాంతం సంబంధం లేకుండా సినిమాలు ఆడియన్స్ ని అలరిస్తూ కాసులు వర్షం కురుపిస్తున్నాయి. మొదటి వీకెండ్ పూర్తీ అయ్యేలోపే 100 కోట్లు కలెక్షన్స్ ని అందుకుంటూ వావ్ అనిపిస్తున్నాయి. తాజాగా ఈ కలెక్షన్స్ విషయంలో పాన్ ఇండియా చిత్రాలు క్రియేట్ చేయని ఒక రికార్డుని జైలర్, భోళా శంకర్, గదర్ 2 (Gadar 2), ఓమైగాడ్ 2 (OMG2) చిత్రాలు కలిసి సృష్టించాయి.

Jailer : థియేటర్‌లో తమన్నాతో పోటీ పడి డ్యాన్స్ చేసిన వృద్ధుడు.. దద్దరిల్లిన సినిమా హాల్

వందేళ్ల సినిమా చరిత్రలో గత వారం రిలీజ్ అయిన ఈ నాలుగు చిత్రాలు సరికొత్త రికార్డుని సృష్టించినట్లు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఆగస్టు 11 నుంచి 13 వరకు ఈ నాలుగు సినిమాలను దాదాపు 2 కోట్ల 10 లక్షల మంది వీక్షించినట్లు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా జైలర్, భోళాశంకర్, గదర్2, ఓమైగాడ్2 సినిమాలు ఉమ్మడిగా రూ.390 కోట్లు కలెక్షన్స్ ని రాబట్టాయి. వందేళ్ల సినిమా చరిత్రలో ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డు అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయం చిరంజీవి, నిర్మాత గొడవ నిజమేనా..? వైరల్ అవుతున్న వాట్సాప్ చాట్..

కాగా ఈ నాలుగు సినిమాల్లో గదర్2, ఓమైగాడ్2 రెండు బాలీవుడ్ చిత్రాలు. అంతేకాదు ఈ రెండు ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ గా వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సీక్వెల్స్ కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఇక తమిళ్ పరిశ్రమ నుంచి రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ యాక్షన్ థ్రిల్లర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కింది.