Apple Warn : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. పక్కనే ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Apple Warn : ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? ఐఫోన్ యూజర్లను ఆపిల్ హెచ్చరిస్తోంది. నిద్రించే సమయంలో పక్కనే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల చాలా ప్రమాదమని హెచ్చరిస్తోంది.

Apple Warn : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. పక్కనే ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

Apple warns iPhone users about sleeping next to their phone while it charges

Apple Warn : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఐఫోన్ పక్కనే ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? ఇలా నిద్రపోవడం వల్ల మంటలు, విద్యుదాఘాతం, గాయాలు, ఆస్తి నష్టం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరిక జారీ చేసింది. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఫోన్‌ ఛార్జింగ్ పెట్టాలని సూచిస్తోంది. పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసిన సమయంలో ఫోన్ దుప్పట్లు లేదా దిండ్లు కింద ఉంచరాదని గట్టిగా హెచ్చరిస్తోంది. ఛార్జింగ్ ఉన్న ఫోన్ పక్కన పడుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై ఆపిల్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది.

ఫోన్ ఛార్జింగ్‌కు సంబంధించి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఛార్జింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేసిన డివైజ్‌తో పాటు నిద్రించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తోంది. ఫోన్ పేలుడు కారణంగా విద్యుత్ షాక్, గాయాలు, ఆస్తికి నష్టం వాటిల్లుతాయని తెలిపింది. ఈ ప్రమాదాలను నివారించడానికి మంచి వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో కేబుల్‌కు కనెక్ట్ చేయాలని వారి ఫోన్‌లు ఛార్జింగ్ అవుతున్నాయని నిర్ధారించుకోవాలని ఆపిల్ యూజర్లకు గట్టిగా సలహా ఇస్తుంది.

Read Also : iPhone 14 Plus Series : లైటనింగ్ పోర్టుకు ఇక బైబై.. USB టైప్-C పోర్టుతో రానున్న ఐఫోన్ 14 ప్లస్ సిరీస్, ఐఫోన్ 15 సిరీస్ కూడా..!

ఐఫోన్ డివైజ్ వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున దుప్పటి లేదా దిండు కింద ఫోన్‌ను ఛార్జింగ్ చేయరాదని సూచించింది. ఆపిల్ నుంచి కీలక సందేశం స్పష్టంగా ఉంది. డివైజ్, పవర్ అడాప్టర్ లేదా వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోకండి. పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు లేదా మీ శరీరం కింద ఉంచకుండా ఉండండి. ఐఫోన్‌లు, పవర్ అడాప్టర్‌లు, వైర్‌లెస్ ఛార్జర్‌లను ఎల్లప్పుడూ బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశాలలో ఉపయోగించాలని లేదా ఛార్జ్ చేయాలని సిఫార్సు చేసింది.

Apple warns iPhone users about sleeping next to their phone while it charges

Apple warns iPhone users about sleeping next to their phone while it charges

థర్డ్-పార్టీ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆపిల్ ముందుగానే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆపిల్ అధికారిక ప్రొడక్టుల ద్వారా భద్రతా ప్రమాణాలు లేని ఛార్జర్లను వినియోగించరాదని సూచిస్తోంది. ఈ ఆందోళనను పరిష్కరించడానికి.. అంతర్జాతీయ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండే ‘మేడ్ ఫర్ ఐఫోన్’ కేబుల్‌లను మాత్రమే ఎంచుకోవాలని ఆపిల్ యూజర్లకు సూచనలు చేస్తోంది.

USB 2.0 లేదా తర్వాతి ప్రమాణాలకు అనుగుణంగా, సంబంధిత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండే థర్డ్-పార్టీ కేబుల్స్, పవర్ ఎడాప్టర్‌లను ఉపయోగించి ఐఫోన్‌ను ఛార్జ్ చేయడం సాధ్యమే అయినప్పటికీ.. ఇతర అడాప్టర్‌లు ఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని తెలిపింది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు నిద్రపోవడం చాలా ప్రమాదమని కంపెనీ పలు జాగ్రతలు సూచించింది.

లిక్విడ్‌లు లేదా నీటి దగ్గర ఫోన్‌లను ఛార్జింగ్ చేయరాదని, దెబ్బతిన్న ఛార్జర్‌లతో ఫోన్ ఛార్జింగ్ పెట్టరాదని సూచించింది. బలహీనమైన కేబుల్‌లు లేదా ఛార్జర్‌లను ఉపయోగించడం లేదా తేమ కలిగిన చోట ఛార్జింగ్ చేయడం వల్ల మంటలు, విద్యుత్ షాక్‌లు, గాయాలు లేదా ఇతర ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Read Also : iPhone 14 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 15 లాంచ్‌కు ముందే ఆపిల్ అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!