Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ నుంచి గౌతమ్ గంభీర్ ఔట్..? కేకేఆర్ జట్టులోకి ఎంట్రీ.. అసలు విషయం ఏమిటంటే?

లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా భారత మాజీ ప్లేయర్, సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల నియామకం అయ్యారు

Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ నుంచి గౌతమ్ గంభీర్ ఔట్..? కేకేఆర్ జట్టులోకి ఎంట్రీ.. అసలు విషయం ఏమిటంటే?

Gautam Gambhir

Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024కు ముందు ఫ్రాంచైజీలు తమ జట్లలో మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో ముందు వరుసలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఉంది. ఎల్‌ఎస్‌జీ ప్రధాన కోచ్‌గా ఆండ్లీ ఫ్లవర్‌ తప్పుకోవడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం లక్నో జట్టుకు మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి గంభీర్ ఆ జట్టుకు మెంటర్ గా కొనసాగుతున్నారు. జట్టుతో రెండేళ్ల అనుబంధాన్ని తెచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

India vs Ireland 1st T20 Match: లాస్ట్‌లో వచ్చి సిక్సర్ల మోతమోగించిన ఐర్లాండ్ బ్యాటర్ .. టీమిండియా కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే ..

గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024కి ముందు గంభీర్ కేకేఆర్ జట్టులోకి చేరుతాడని తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కు కేకేఆర్ జట్టుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఐపీఎల్ ఆరంభంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడిన గంభీర్, ఆ తరువాత కేకేఆర్ తరపున ఆడాడు. 2011లో రూ. 11 కోట్లతో కేకేఆర్ జట్టులో చేరిన గంభీర్ మరుసటి ఏడాది 2012లో తన సారథ్యంలో జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తరువాత 2014లోనూ అతని కెప్టెన్సీలో కేకేఆర్ రెండోసారి చాంపియన్ గా నిలిచింది. దాదాపు ఏడు సంవత్సరాలు కేకేఆర్ జట్టులో గంభీర్ కొనసాగాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తరువాత 2021లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ వచ్చాడు. తాజాగా లక్నోతో రెండేళ్ల అనుబంధాన్ని తెంచుకొనేందుకు గంభీర్ సిద్ధమయ్యాడని సమాచారం.

IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్ విజయం

లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా భారత మాజీ ప్లేయర్, సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల నియామకం అయ్యారు. ఇదిలాఉంటే, కేకేఆర్ జట్టును గౌతమ్ గంభీర్ వీడిన తరువాత మళ్లీ ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. దీంతో గంభీర్ ని తిరిగి టీంలోకి తీసుకొచ్చేందుకు కేకేఆర్ యాజమాన్యం చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. గంభీర్‌తో కేకేఆర్ యాజమాన్యం చర్చలు సఫలం అయితే 2024 ఐపీఎల్‌లో గంభీర్‌ను కేకేఆర్ జట్టు తరపున చూడొచ్చు.