Madhya Pradesh Polls: బీజేపీ ఏ హామీ ఇస్తుందో ముందే చేప్పేస్తున్న కాంగ్రెస్

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు సాధించలేదు. అయితే బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ పార్టీలోని జ్యోతిరాదిత్య తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది

Madhya Pradesh Polls: బీజేపీ ఏ హామీ ఇస్తుందో ముందే చేప్పేస్తున్న కాంగ్రెస్

MP Assembly Elections: దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లో ఈ వేడి ఇంకాస్త కాకమీదే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే రణరంగంలో తమకు తోచిన ఫీట్లు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) నువ్వా-నేనా అంటూ తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయగా.. కాంగ్రెస్ ఆ పనిలో ఉన్నట్లు సమాచారం.

Bihar Politics: నెహ్రూ నుంచి వాజ్‌పేయి వరకు వచ్చిన పేరు మార్పు రాజకీయం.. తాజాగా అటల్ పార్క్ పేరు మార్పు

కాగా, ఎన్నికల వేళ పార్టీలు మానిఫెస్టో సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నాయి. ఇక తోచిన హామీలు ఇప్పటికే ఇచ్చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ హామీ ఇస్తుందో విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ ప్రకటిస్తుంది’’ అని ఆయన అన్నారు వాస్తవానికి మధ్యప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో సబ్సిడీ సిలిండర్ ధరను రూ.500లకు తగ్గించింది అక్కడి ప్రభుత్వం. ఆ ప్రభావం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై చాలా ఎక్కువ ఉందనే అర్థంలో కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Politics: మత్య్సకారుల సమావేశంలో ఐశ్వర్య రాయ్‭ పేరెత్తిన మంత్రి.. వివాదం లేవనెత్తిన విపక్షాలు

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు సాధించలేదు. అయితే బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ పార్టీలోని జ్యోతిరాదిత్య తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.