Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా హెగ్డే ప్లేస్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్.. మొన్నటిదాకా అబ్బాయి ఇప్పుడు బాబాయ్‌ సరసన..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా అనుకున్నారు. అయితే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా హెగ్డే ప్లేస్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్.. మొన్నటిదాకా అబ్బాయి ఇప్పుడు బాబాయ్‌ సరసన..

Pooja Hegde Replaced with Sakshi Viadya in Ustaad Bhagat Singh Movie

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే మూడేళ్ళ నుంచి ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటికే కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే జరగగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతున్నట్టు సమాచారం. పవన్ ఇటీవల వారాహి యాత్ర(Varahi Yatra) పూర్తి చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రెండు షెడ్యూల్స్ డేట్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా షూట్ మొదలుపెట్టారు. ఇటీవలే ఈ సినిమా షూట్ నుంచి పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్ ఒకటి లీక్ అయింది. ఇక ఈ సినిమా తమిళ్ తేరి సినిమా రీమేక్ అని వార్తలు వస్తా హరీష్ మాత్రం కాదంటున్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా అనుకున్నారు. అయితే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది. అటు మహేష్ గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నుంచి కూడా తప్పుకుంది. కారణాలేంటో తెలీదు కానీ పూజా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల నుంచి తప్పుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)ని రీప్లేస్ చేయగా, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా ప్లేస్ లో సాక్షి వైద్యని రీప్లేస్ చేసినట్టు సమాచారం.

Neha Shetty : మొన్న తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అయ్యారు.. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కనెక్ట్ అవుతారు.. స్టేజిపై స్పీచ్‌తో రెచ్చిపోయిన నేహశెట్టి..

మోడల్ గా పనిచేసే సాక్షి వైద్య(Sakshi Vaidya) అఖిల్ ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇప్పుడు వరుణ్ తేజ్ సరసన గాండీవధరి అర్జున అనే సినిమాతో రాబోతుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొనబోతుంది అని సమాచారం. మొన్నటిదాకా అబ్బాయితో కలిసి నటించిన సాక్షి వైద్య ఇప్పుడు బాబాయ్ తో నటించబోతుంది. దీంతో రెండు సినిమాలతోనే ఏకంగా పవన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.