Parakramam : బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’.. చిరంజీవి పుట్టిన రోజునే సినిమా రిలీజ్..

తాజాగా పరాక్రమం సినిమా టీజర్ లాంచ్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు.

Parakramam : బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’.. చిరంజీవి పుట్టిన రోజునే సినిమా రిలీజ్..

Bandi Saroj Kumar Parakramam Movie Release Date Announced

Parakramam : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి పలు బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఇప్పుడు ‘పరాక్రమం’ సినిమాతో రాబోతున్నాడు. గల్లీ క్రికెట్, లవ్, నాటకాలు కాన్సెప్ట్ తో పరాక్రమం సినిమా తెరకెక్కుతుంది. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా పరాక్రమం సినిమా టీజర్ లాంచ్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసిన చిరంజీవి పుట్టిన రోజు నాడు మా పరాక్రమం సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాం. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. కొంతమంది చిరంజీవిని గారు అని పిలవమని చెప్తున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. నాకు చిరంజీవి కూడా ఇంట్లో సభ్యుడిలాగే. నాకు ఆయన శివుడి లాంటివాడు అని అన్నారు.

Also Read : Game Changer : రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండ‌గే.. ‘గేమ్ ఛేంజ‌ర్’ పై త‌మ‌న్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

ఇక ఈ పరాక్రమం సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. గతంలో నారాయణగూడ బాయ్స్ హాస్టల్ లో ఉన్నప్పుడు ఓ ఆర్టీవో ఆఫీసర్ అబ్బాయి మా పక్కనే ఉండేవాడు. వాళ్లది రిచ్ ఫ్యామిలీ. నేను ఒక రోజు రోడ్డు మీద క్రికెట్ ఆడుతుంటే, క్రికెటర్ అవుతావా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వెనక చూసి ముందుకు వెళ్లాలి బ్రదర్ అన్నాడు. ఆ రోజు అతను అన్న మాటలు నాలో కసిని పెంచాయి. ఎప్పటికైనా అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నాను. ఆ ఆలోచనతో ఈ సినిమాలో లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నా అతనికి థ్యాంక్స్. గతంలో నేను చేసిన సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూసారు. కానీ ఈ పరాక్రమం సినిమా ఎవరైనా చూడొచ్చు అని తెలిపారు.