Samantha : నానితో సమంత చేసిన క్యూట్ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే..

సమంత నుంచి కొత్త సినిమా రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఒక పాత సినిమా రీ రిలీజ్ అవుతుంది.

Samantha : నానితో సమంత చేసిన క్యూట్ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే..

Samantha Nani Eto Vellipoyindi Manasu Movie Re Releasing

Updated On : July 24, 2024 / 7:00 AM IST

Samantha : సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఖుషి సినిమా తర్వాత మళ్ళీ సమంతని ఎప్పుడు తెరపై చూస్తామని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే సమంత నుంచి కొత్త సినిమా రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఒక పాత సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాని, సమంత జంటగా నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

నాని, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి మెలోడీ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకు ఇళయరాజా ఇచ్చిన పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాని తెలుగులో నానితో – తమిళ్ లో జీవాతో చిత్రీకరించారు. ఎటో వెళ్లిపోయింది మనసు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. 2012 లో రిలీజయిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది.

Also Read : Parakramam : బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’.. చిరంజీవి పుట్టిన రోజునే సినిమా రిలీజ్..

ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించగా ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఆగస్ట్ 2న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత స్కూల్, కాలేజీ అమ్మాయిగా కూడా నటించి క్యూట్ గా ప్రేక్షకులని మెప్పించింది. దీంతో నాని, సమంత ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి క్యూట్ సమంతని థియేటర్లో చూడటానికి రెడీ అవుతున్నారు.

Samantha Nani Eto Vellipoyindi Manasu Movie Re Releasing