Asia Cup : స‌చిన్ రికార్డుపై కోహ్లి, రోహిత్ క‌న్ను.. మొద‌ట బ్రేక్ చేసేది ఎవ‌రో..?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup) ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానుంది. భార‌త స్టార్ ఆట‌గాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)లు భార‌త దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుపై క‌న్నేశారు.

Asia Cup : స‌చిన్ రికార్డుపై కోహ్లి, రోహిత్ క‌న్ను.. మొద‌ట బ్రేక్ చేసేది ఎవ‌రో..?

Rohit and Kohli eye on Sachin record

Asia Cup 2023 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆసియా క‌ప్ (Asia Cup) ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానుంది. హైబ్రిడ్ మోడ్‌లో వ‌న్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జ‌ర‌గ‌నుంది. మొత్తం 13 మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌గా పాకిస్తాన్ నాలుగు, శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌తో నేపాల్ త‌ల‌ప‌డ‌నుంది. ఇందుకు ముల్తాన్ వేదిక కానుంది. ఇక భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 2న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఆడ‌నుంది.

ఆసియా క‌ప్‌ను సాధించాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో టీమ్ఇండియా బ‌రిలోకి దిగుతోంది. చివ‌రి సారిగా 2018లో భార‌త జ‌ట్టు ఈ టోర్నీలో విజేత‌గా నిలిచింది. అప్పుడు కూడా ఈ టోర్నీని వ‌న్డే ఫార్మాట్‌లోనే నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. దీంతో త‌న‌కు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో స‌త్తా చాటాల‌ని బావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆసియా క‌ప్‌ను 15 సార్లు నిర్వ‌హించారు. 13 సార్లు వ‌న్డే ఫార్మాట్‌లో, 2 సార్లు టీ20 ఫార్మాట్‌లో జ‌రిగింది.

ODI World Cup 2023 : ఆరంభ వేడుక‌లు..! అప్ప‌ట్లో రిక్షాల‌పై ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్లు.. ఇప్పుడెలా వ‌స్తారో..?

ఇదిలా ఉంటే.. భార‌త స్టార్ ఆట‌గాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli)లు భార‌త దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుపై క‌న్నేశారు. ఆసియా క‌ప్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి స‌చిన్ రికార్డును బ్రేక్ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హించిన ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టు త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడు. 23 మ్యాచుల్లో 51.10 స‌గ‌టుతో రెండు శ‌త‌కాలు, 7 అర్థ‌శ‌త‌కాల సాయంతో 971 ప‌రుగులు చేశాడు.

భార‌త వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 22 వ‌న్డే మ్యాచులు ఆడాడు. 21 ఇన్నింగ్స్‌ల్లో బ‌రిలోకి దిగిన హిట్‌మ్యాన్ 46.56 స‌గ‌టుతో ఓ శ‌త‌కం, ఆరు అర్థ‌శ‌త‌కాల సాయంతో 745 ప‌రుగులు చేశాడు. స‌చిన్ కంటే రోహిత్ 226 ప‌రుగులు మాత్ర‌మే త‌క్కువ‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ స‌చిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయి.

CPL 2023 : అగో.. రెడ్ కార్డు వ‌చ్చింది.. నువ్వు బ‌య‌టికి పో.. పాపం సునీల్ న‌రైన్‌.. పొలార్డ్ ఇలా చేశావేంటి..?

ఇక ఆసియా క‌ప్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు సాధించిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. పాకిస్తాన్ పై అత‌డు 183 ప‌రుగులు చేశాడు. మొత్తంగా ఆసియా క‌ప్‌లో 11 మ్యాచులు ఆడిన కోహ్లి 10 ఇన్నింగ్స్‌ల్లో 61.30 స‌గ‌టుతో మూడు సెంచ‌రీలు, ఓ హాఫ్ సెంచ‌రీ సాయంతో 613 ప‌రుగులు చేశాడు. సచిన్ కంటే 358 ప‌రుగులు త‌క్కువ‌.

ఆసియా క‌ప్‌లో టీమ్ఇండియా సూప‌ర్ ఫోర్ కు అర్హ‌త సాధిస్తే ఐదు మ్యాచులు, ఫైన‌ల్‌కు చేరుకుంటే ఆరు మ్యాచులు ఆడ‌నుంది. రోహిత్‌, కోహ్లి ఫామ్‌ల‌ను ప‌రిశీలిస్తే స‌చిన్ రికార్డును అందుకోవ‌డం వారికి పెద్ద కష్టం కాక‌పోవ‌చ్చు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ముందుగా స‌చిన్ రికార్డును బ్రేక్ చేస్తారో అని అభిమానులు ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు.

CPL 2023 : మ‌న‌కెందుకు భ‌య్యా.. ఇలాంటి రిస్క్ షాట్లు.. ఏదైన జ‌రిగుంటే..?