Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయం దాటి పోయిందని ఇక టీడీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.

Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu : టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయం దాటి పోయిందని ఇక టీడీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతు.. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో చంద్రబాబు టీడీపీ, బీజేపీ పొత్తు గురించి తేల్చేస్తు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.

తెలంగాణలో ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే విషయంపై కమిటీ వేశామని ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లోను టీడీపీ పోటీ చేయాలని కోరతున్నారని..కానీ గెలిచే స్థానాలపై దృష్టి సారించాలని కాసానికి సూచించానని తెలిపారు. షెడ్యూల్ కు ముందే అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని తెలిపారు చంద్రబాబు.

1980 నుంచే టీడీపీ జాతీయ కూటముల్లో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ఇటీవల ఏర్పడిన ఇండియా కూటమి గురించి కూడా మాట్లాడుతు..ఇండియా కూటమికి లీడర్ లేకపోవటం బీజేపీ అనుకూలమైన అంశం అని పేర్కొన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి ఎలా ముందుకెళుతుందే వేచి చూడాలని అన్నారు.

Gannavarm : గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు.. ప్లాన్ మార్చిన వైసీపీ!

ఈ సందర్బంగా చంద్రబాబు ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీ భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని.. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే మోదీని విమర్శించటలేదు అటువంటిది మోదీ వయస్సు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి ఏపీ, తమిళనాడులో హస్తం పార్టీ పుంజుకునే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణ (Telangana) లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్ధుల్ని దాదాపు ప్రకటించాయి. కొన్ని స్థానాల్లో మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఈక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక టీడీపీ (TDP) తెలంగాణలో దాదాపు కనుమరుగు అయిపోయినట్లుగా తయారైంది. తెలంగాణలో బీఆర్ఎస్ హవా ఇప్పటి వరకు కొనసాగింది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తంచేస్తోంది.

Raja Singh: అవసరమైతే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళతాయనే వార్తలు వచ్చాయి. తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా..? ఆ రెండు పార్టీలు కలిస్తే నష్టమా..? లాభమా..? అనే చర్చ గత కొంతకలంగా తెలంగాణలో జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

గెలుపు కోసం అటు అధికార పార్టీ ఇటు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అస్త్రశస్త్రాలు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తుకు టైమ్ దాటిపోయిందని చెప్పటంతో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లైంది.