Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.  

Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

Cotton Crop

Cotton Crop : వరుసగా కురిసిన అధిక వర్షాలకు పత్తి పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి.  పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇటు కలుపు కూడా అధికంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట వివిధ ప్రాంతాల్లో25-40 రోజుల దశలో ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు , కాబట్టి ఈ సమయంలో  ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Drumstick Cultivation : మునగ సాగులో ఎరువుల యాజమాన్యం!

ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 – 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.  చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు కలుపు సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా, పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. రజినీకాంత్