Actor Vijay: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫిర్మ్ అయినట్టే.. చాలా ప్లానింగ్‭తో ఒక్కో స్టెప్ వేస్తున్నారుగా

ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ మాజీ సీఎం కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు

Actor Vijay: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫిర్మ్ అయినట్టే.. చాలా ప్లానింగ్‭తో ఒక్కో స్టెప్ వేస్తున్నారుగా

Political Entry: తమిళ్ హీరో, తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ వార్తలను విజయే స్వయంగా ఖండించారు. కానీ, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. అంటే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లే క్లియర్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలను పూర్తిగా వదిలిస్తానని విజయ్ చెప్పారు. ఇంతకు ముందు రాజకీయ ఎంట్రీపై వార్తల్ని పూర్తిగా ఖండించిన ఆయన.. తాజాగా ఒకవేళ వస్తే ఇలా చేస్తానని చెప్పడం గమనార్హం.

Pawar on Mayawati: మాయావతి న్యూట్రల్ స్టాండ్ ఏంటి? పెద్ద ఆరోపణ చేసిన శరద్ పవార్

ఇకపోతే.. రాజకీయ ఎంట్రీ కోసం విజయ్ చాలా ప్లానింగ్‭తో ఒక్కో స్టెప్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం చెన్నైలో 10, 12 తరగతుల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. అంతే కాకుండా ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి, మద్రాస్ స్టేట్ మాజీ సీఎం కామరాజ్ వంటి నాయకుల గురించి వీలైనంత ఎక్కువ చదవాలని విద్యార్థులకు సూచించారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న అంచనాల నడుమ అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి నాయకులను గుర్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Thalapathy Vijay : 10 గంటలు పైగా స్టేజిపై నించొని.. 1000 మందికి పైగా స్టూడెంట్స్ కి సన్మానం చేసి.. వైరల్ అవుతున్న తలపతి విజయ్..

అదే సమావేశంలో ఓట్ల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “మీరే భావి ఓటర్లు. రాబోయే రోజుల్లో మంచి నాయకులను ఎన్నుకునేది మీరే. ప్రజలు కూడా ఓటుకు డబ్బు తీసుకుంటున్నారు. ఓటుకు రూ.1,000 ఇస్తున్నారు. అంటే ఒక నియోజకవర్గంలో దాదాపు 1.5 లక్షల మంది ఓటర్లు ఉంటే, దాదాపు 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎంత సంపాదించాడో ఊహించండి. ఈ విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మన విద్యా విధానంలో ఇలాంటివి బోధించబడాలని నేను కోరుకుంటున్నాను” అని విద్యార్థులతో విజయ్ అన్నారు.

Actor Vijay: అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులను వీలైనంత ఎక్కువ చదవండి.. విద్యార్థులతో దళపతి విజయ్

ఇక, పొలిటికల్ ఎంట్రీ కోసం.. కొత్తగా న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కుమారుడు జాసన్ సంజయ్ ని డైరెక్టర్ చేయబోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ‘లైకా ప్రొడక్షన్స్’ (Lyca Productions) లో జాసన్ సంజయ్ తన మొదటి మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. తన పొలిటికల్ ఎంట్రీకి ముందే కుటుంబ, ఇతర విషయాల్ని సరిదిద్దేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.