విశాఖలో వైసీపీకి భారీ షాక్.. ఒకేసారి టీడీపీలో చేరిన ఆ 14 మంది

వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే బుజ్జగించారు. అయితే, ఆ బుజ్జగింపులు ఫలించ లేదు.

విశాఖలో వైసీపీకి భారీ షాక్.. ఒకేసారి టీడీపీలో చేరిన ఆ 14 మంది

YCP Corporators Join TDP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ హాజరయ్యారు. కార్పొరేటర్లు పార్టీ మారడంతో వైసీపీ మేయర్ పీఠం చేజారే అవకాశం ఉంది. వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే కార్పొరేటర్లను బుజ్జగించారు. అయితే, ఆ బుజ్జగింపులు ఫలించలేదు.

14మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా, మరికొందరు కార్పొరేటర్లు జనసేనలో చేరాలని వచ్చారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో తాము జనసేనలో చేరతామని వారు కోరారు. దాంతో 23న లేదా 24న పవన్ సమక్షంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నారు. వైసీపీ సంఖ్యా బలం తగ్గడంతో మేయర్ పీఠం చేజారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని కచ్చితంగా టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. అయితే, చట్టంలో మార్పుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లలో పీఠాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసే ఛాన్స్ ఉంది.

కౌన్సిల్ కు సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నందున.. మేయర్ పీఠం కచ్చితంగా కూటమి సర్కార్ కే దక్కే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి 14 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరికొందరు కార్పొరేటర్లు కూడా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక, కార్పొరేటర్లే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం టీడీపీలో చేరే అవకాశం ఉందని గంటా శ్రీనివాస రావు అన్నారు. మేమే కనుక గేట్లు ఓపెన్ చేస్తే కార్పొరేటర్లే కాదు మొత్తం అంతా కూడా వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాస రావు అన్నారు.

Also Read : సిక్కోలు టీడీపీకి వచ్చిన సమస్యేంటి? ఏం జరుగుతోంది?