Dairy Farm : వానాకాలం పాడిపరిశ్రమలో జాగ్రత్తలు

వర్షాకాలంలో పశువులకు  అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది.

Dairy Farm : వానాకాలం పాడిపరిశ్రమలో జాగ్రత్తలు

Dairy Farm

Dairy Farm : నేడు స్వయం ఉపాధి మార్గంగా విరాజిల్లుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి పాడి పరిశ్రమ. అయితే నిత్య పర్యవేక్షణ, ఎదురయ్యే సమస్యల పట్ల అవగాహణ వుంటేనే ఈ పరిశ్రమలో మంచి ప్రతిఫలం పొందగలుగుతారు. ముఖ్యంగా కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యల పట్ల పశుపోషకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏకాలంలో వుండే సమస్యలు ఆ కాలంలో వుంటాయి. ఇది మనుషులకే కాదు, మూగ జీవాలకూ వర్తిస్తుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

అసలు వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. అడపాదడపా పడే జల్లులకు పరిశుభ్రత లోపించి, పశువులు వ్యాధుల బారిన పడటంతో, పాల వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ముసిరే ఈగలు, దోమలు మనుషులకే కాదు పశుపక్షాదులకు అనేక సమస్యలను తెచ్చిపెడతాయి. పాడిపరిశ్రమనే తీసుకుంటే వేసవికాలంలో అధిక శ్రద్ధ కనబరిచే పోషకులు మిగిలిన కాలాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.

అడపా దడపా పడే వర్షపు చినుకులకు పాకల్లో పరిశుభ్రత లోపించి, పశువులు తొందరగా వ్యాధుల బారిన పడుతూవుంటాయి. కనుక, పశుపోషకలు అప్రమత్తంగా ఉంటూ, దాణాల వాడకంలో తగు మార్పులు దిగుబడి తగ్గి, పరిశ్రమ లాభసాటిగా వుండదు. దీనికి తోడు ముసిరే ఈగలు, దోమలు  అంటువ్యాధులకు అనువుగా మారి మరింత ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి పశుపాకలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా వుంచటంతోపాటు, అందించే మేతల విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

పశువుల షెడ్లు ఎప్పటికప్పుడూ పొడిగా వుండేలా చూసుకోవాలి. అసలు షెడ్లు ఎలా నిర్మించాం అనే దానికన్నా.. పశువులకు అవి ఎంత సౌకర్యవంతంగా వున్నాయో చూసుకోవాలి. నిర్మాణ సమయంలోనే ఎత్తైన ప్రదేశంలో పాకలను ఏర్పాటుచేసుకుంటే నీరు పల్లపు ప్రాంతాలకు చేరి, చుట్టుప్రక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా వుంటాయి. అంతేకాదు, గాలి, వెలుతురు దారాళంగా ప్రసరిస్తుండటంతో పశువులు ఆరోగ్యంగా వుంటాయి.

సాధారణంగా పశువులు మట్టిపై పడుకోవటానికి ఎక్కువ ఇష్టపడతాయి. షెడ్లలో అడుగుభాగాన్ని సిమెంటు కాంక్రీటుతో కానీ, నాపరాళ్ళతో కానీ, నిర్మించినప్పుడు అడుగుభాగం నునుపుగా వుండకుండా గరుకుగా వుండేటట్లు జాగ్రత్త వహించాలి. గచ్చును ఏటవాలుగా వుండేటట్లు చూసుకుంటే పశుమూత్రం నిల్వ వుండకుండా డ్రెయినేజీలోకి వెళ్లడానికి వీలుగా వుంటుంది. అలాగే  పేడను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ, పాకలకు దూరంగా కుప్పలుగా వేసుకోవాలి.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

షెడ్ల చుట్టుప్రక్కల ఎలాంటి మురుగు నీరు నిల్వవుండకుండా చూసుకోవాలి. లేనట్లయితే అక్కడ ఈగలు, దోమలు చేరి రోగాలను వ్యాప్తి చేసే ప్రమాదం వుంది. వీటి తాకిడి ఎక్కువగా వుంటే పశువులు చికాకుకు గురై, మేత సరిగా తినవు.   తద్వారా పాలదిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం వుంది. ఈసమస్యను అధిగమించటానికి ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందు ద్రావణాలతో షెడ్లను ప్రతిరోజూ కడుగుతూ పరిశుభ్రంగా వుంచాలి. దోమలు పాకల్లోకి రాకుండా దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలి.  ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వేపాకు పొగ పెట్టడం వల్ల వీటి బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చు.

వర్షాకాలంలో పశువులకు అందించే మేతల్లో కూడా రైతులు కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. తొలకరి జల్లులకు క్రొత్తగా మొలిచే పచ్చికతోపాటే వ్యాధుల ప్రమాదం కూడా పొంచి వుంటుంది. కాబట్టి పశువులను బయటకు పంపకుండా పాకల్లోనే వుంచి మేతలను అందించటం మంచిది. మేతతోపాటు పరిశుభ్రమైన నీటిని అందుబాటులోవుంచాలి. ఒక్కో పశువుకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం పడుతుంది.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

తాగే నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచుగా నీటితోట్లకు సున్నం వేస్తుంటే శిలీంద్రాలు వ్యాప్తి చెందవు. పశువులకు అందించే దాణాలు వర్షపు నీటికి తడిస్తే అందులో అఫ్లోటాక్సిన్స్ చేరి, చెడిపోయే అవకాశం వుంది. కాబట్టి దాణాలు తడవకుండా జాగ్రత్తపడాలి. ఈకాలంలో పడే వర్షాలను ఉపయోగించుకుని పశుగ్రాసాలను పెంచుకుంటే సంవత్సరం పొడవునా మేతలకు కొరవ వుండదు. వీటిలో ఏకవార్షికాలతోపాటు పలు కోతలనిచ్చే బహువార్షికాలు అందుబాటులో వున్నాయి.

వర్షాకాలంలో పశువులకు  అంటువ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. దీని ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. సాధారణంగా తొలకరి వర్షాలు పడగానే సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, గురకరోగము, జబ్బవాపు, పొదుగువాపు వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి.

READ ALSO : Ladies Finger Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

కాబట్టి ఎప్పటికప్పుడు పశువులను గమనించుకుంటూ వైధ్యుని సూచనల మేరకు ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పశుపాకలలో పేలు, పిడుదులు, గోమార్ల నిర్మూలనకు మందులను పిచికారీ చేసుకోవాలి. వర్షాకాలంలో ఎదను గుర్తించి సకాలంలో గర్భధారణ చేయించాలి. ఈవిధంగా పశుపోషకులు కాలానుగుణంగా యాజమాన్యంలో మార్పులు చేసుకుంటూ.. పోషణ చేపట్టినట్లయితే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది.