Bihar Politics: ఎన్డీయేలో చేరతారా, లేదంటే ఇండియాలోనా.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.

Bihar Politics: ఎన్డీయేలో చేరతారా, లేదంటే ఇండియాలోనా.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

Prashant Kishore: పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. అయితే రానున్న కాలంలో ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఎన్డీయేతో వెళ్తారా అనే ఊహాగాణాలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై ఆయన మంగళవారం క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడ ఉంటాననేది కాలమే నిర్ణయిస్తుందని పీకే అన్నారు.

IND vs PAK : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ vs పాక్ మ్యాచ్.. టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌లు.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

ముజఫర్‌పూర్ నగరంలో విలేకరుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలపై మాకు కూడా కొంత అవగాహన ఉంది, నేను మహాకూటమిలో లేదా ఎన్డీయేలో ఉంటే తప్ప, మేము మీతో ఉండబోమని బీహార్ ప్రజలు నాకు చెప్పడం లేదు. అందుకు భిన్నంగా కొత్తదనం కావాలి అంటున్నారు. బీహార్‌లో కొత్తదనం జరగాలని ప్రతి ఇంట్లో ప్రజలు చెబుతున్నారు’’ అని అన్నారు.

Pakistan : ఐఎస్ఐ సాయం కోరిన టిక్ టాక్ స్టార్.. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ..

మరోవైపు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు. దీనిపై జన్‌ సూరజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ స్పందిస్తూ.. బీజేపీ లేదా ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అన్నారు. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏమిటో, భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఏమిటో, తల్లిదండ్రుల మధ్య అనుబంధం ఏమిటో మీకు తెలియదు, మాకు తెలియదు, బీజేపీ వాళ్లకు కూడా తెలియదని అన్నారు.