Naresh-Pavitra : మరోసారి స్టేజిపై నరేష్, పవిత్ర సందడి.. ముద్దులు, ముద్దు పేరులతో..

టీవీ షోలో మరోసారి సెన్సేషన్ అయిన నరేష్ పవిత్ర. స్టేజి పై ముద్దులు, ముద్దు పేరులతో..

Naresh-Pavitra : మరోసారి స్టేజిపై నరేష్, పవిత్ర సందడి.. ముద్దులు, ముద్దు పేరులతో..

Naresh Pavitra in recent tv show Vinayaka Chavithi special promo gone viral

Naresh-Pavitra : టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్న సంగతి అందరి తెలిసిందే. తాజాగా ఈ కొత్త జంట ఒక టీవీ షోకి అతిథులుగా వచ్చారు. వినాయకచవితి సందర్భంగా ఒక ప్రముఖ టీవీ షోలో ‘స్వామి రారా’ అనే ఒక ప్రత్యేక షోని ప్రసారం చేయబోతున్నారు. ఇక ఈ షోలో టాలీవుడ్ లోని పలువురు కమెడియన్స్, సెలబ్రిటీస్ పాల్గొని సందడి చేశారు. ఈక్రమంలోనే నరేష్, పవిత్ర కూడా జంటగా వచ్చి మరోసారి టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు.

Parineeti Chopra-Raghav Chadha : పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మ్యారేడ్ డేట్ ఫిక్స్? డెస్టినేషన్ ఎక్కడంటే..

ఇక ఈ ప్రోమో నరేష్, పవిత్రకి గులాబీ పువ్వు ఇస్తూ ప్రొపోజ్ చేయడం, స్టేజీపైనే నరేష్ కి పవిత్ర ముద్దు ఇవ్వడం వంటివి కనిపిస్తున్నాయి. అలాగే ఒకరిని ఒకరు ఏఏ ముద్దుపేరులతో పిలుచుకుంటారో కూడా ప్రేక్షకులకు తెలియజేశారు. పవిత్రని నరేష్ ‘బేబీ’ అని పిలుస్తాడట. ఇక నరేష్ ని పవిత్ర ‘రాయ’ అని పిలుస్తుందట. ‘నవరసరాయ’ అనేది నరేష్ కి ఉన్న బిరుదు. దానిలో నుంచి రాయ అనే పదాన్ని తీసుకోని పవిత్ర ఆలా పిలుస్తుందట. ఇక ఈ షోలో నరేష్ పై హైపర్ ఆది వేసే పంచ్ లు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.

Anushka Shetty : ప్రభాస్‌తో మళ్ళీ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క.. ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాడు..

కాగా నరేష్ అండ్ పవిత్ర గతంలో కూడా ఒక టీవీ షోకి హాజరుకాగా.. అప్పుడు కూడా ముద్దులతో స్టేజి పై సెన్సేషన్ సృష్టించారు. మళ్ళీ ఇప్పుడు ఈ షోలో కనిపించబోతున్నారు. అలాగే ఈ షోకి మరో సెలబ్రిటీని కూడా తీసుకు వచ్చారు. బేబీ మూవీతో ఆనంద్ దేవరకొండ, విరాజ్ ఎంత ఫేమస్ అయ్యారో.. చివరిలో వైష్ణవిని పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా అంతే ఫేమస్ అయ్యాడు. దీంతో ఈ షోకి అతని కూడా తీసుకురాగా మరో ఆకర్షణగా మారింది.