Kalki 2898 AD : ప్ర‌భాస్ కల్కి 2898 AD లో రామ్‌గోపాల్ వ‌ర్మ‌..? ఇప్ప‌టికే ఆర్‌జీవీ షూటింగ్ పార్ట్ పూర్తి..?

ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న సినిమా కల్కి 2898 AD. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Kalki 2898 AD : ప్ర‌భాస్ కల్కి 2898 AD లో రామ్‌గోపాల్ వ‌ర్మ‌..? ఇప్ప‌టికే ఆర్‌జీవీ షూటింగ్ పార్ట్ పూర్తి..?

Prabhas-Ram Gopal Varma

Prabhas Kalki 2898 AD : ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న సినిమా కల్కి 2898 AD. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే(Deepika Padukone), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని(Disha Patani)లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. అయితే.. తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిన‌ట్లు ఆ వార్త సారాంశం. అయితే.. దీనిపై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

Prashanth Neel : కుటుంబసభ్యుల పేరులతో పాటు ‘సలార్’ పేరుని కూడా.. ప్రశాంత్ నీల్ వీడియో వైరల్..

చాలా మంది సినీ ప్ర‌ముఖులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి సైతం ఓ క్యామియో రోల్‌లో న‌టిస్తున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమాలో జ‌క్క‌న్న క‌నిపిస్తే హాలీవుడ్‌లోనూ సినిమాపై మంచి బ‌జ్ నెలకొంటుంది అన‌డంలో సందేహం లేదు. అయితే.. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు న‌టిస్తున్నారా..? లేదా అన్న సంగ‌తి చిత్ర బృందం స్పందిస్తే గానీ తెలియ‌దు.

ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12, 2024న విడుద‌ల చేస్తామ‌ని అప్ప‌ట్లో చిత్ర బృందం తెలియ‌జేసింది. అయితే.. ఇటీవ‌ల చిత్ర నిర్మాత అశ్వినీ ద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప్ర‌పంచంలోని ఉత్త‌మ గ్రాఫిక్ కంపెనీలు ఈ సినిమా కోసం ప‌ని చేస్తున్నాయ‌ని చెప్పారు. కేవ‌లం దీని కోస‌మే 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఔట్‌పుట్ చూసి తాను ఆశ్చ‌ర్య‌పోయాన‌ని, మ‌న ఆలోచ‌న‌ల‌కు మించి విజువ‌ల్స్ ఉంటాయ‌న్నారు. అయితే.. అనుకున్న టైమ్‌కు గ్రాఫిక్స్ పూర్తి అవుతుందో లేదోన‌ని సందేహం వెలిబుచ్చారు. దీంతో సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కావ‌డంపై సందిగ్థం నెల‌కొంది.

Pushpa 2 : పుష్ప 2 సెట్స్ నుంచి వీడియో లీక్.. బాబోయ్ ఎన్ని లారీలు..