Tata Nexon Facelift : కారు కొంటున్నారా? టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, EV మోడల్ వచ్చేసిందోచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Tata Nexon Facelift : కొత్త నెక్సాన్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

Tata Nexon Facelift : కారు కొంటున్నారా? టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, EV మోడల్ వచ్చేసిందోచ్.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Tata Nexon Facelift Launched At Rs 8.1 Lakh, Check Full Details

Tata Nexon Facelift : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) 2023 నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 8.1 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లాంచ్ చేసింది. కంపెనీ కొత్త ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, కొత్త ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో కారును అప్‌డేట్ చేసింది. రిఫ్రెష్ డిజైన్, నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ ఫియర్‌లెస్ అనే 4 వేరియంట్‌లలో వస్తుంది. ఇప్పటికే, టాటా మోటార్స్ సెప్టెంబర్ 4న కారు ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.

ఎలక్ట్రిక్ మోడల్ కూడా .. :
కంపెనీ నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్‌ను కూడా ఆవిష్కరించింది. సోషల్ మీడియాలో కంపెనీ షేర్ చేసిన టీజర్ ప్రకారం.. (TATA Nexon Facelift EV) ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, ఇంటెన్సీ టీల్, ఫ్లేమ్ రెడ్‌తో సహా 4 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ టాప్ వేరియంట్ రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది.

Read Also : iPhone NavIC Support : ఆపిల్ ఫ్యాన్స్ ఇది విన్నారా?.. కొత్త ఐఫోన్ 15 ప్రోలో శాటిలైట్ నావిగేషన్ NavIC సిస్టమ్.. ఐఫోన్లలో ఇదే ఫస్ట్ టైం.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కు శక్తినిచ్చే 1.2-లీటర్ టర్బోచార్జడ్ ఇంజన్ 118bhp శక్తిని, 170Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 113 bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన మరో ఆప్షన్ కూడా కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త Nexon పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. నెక్సాన్ వరుసగా రెండేళ్లుగా భారత నంబర్ వన్ SUVగా ఉంది. టాటా మోటార్స్ ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్లకు పైగా కార్లను విక్రయించిందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.

కొత్త మోడల్ సెక్యూరిటీ ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. నెక్సాన్ 2014లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రారంభమైంది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఫస్ట్ క్రాస్‌ఓవర్ SUV భారత మార్కెట్లో సబ్-4 మీటర్ల క్రాస్‌ఓవర్ SUV సెగ్మెంట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. టాటా నెక్సాన్ 2023 స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కార్లలో వేరియంట్ వారీగా 2023 టాటా నెక్సాన్ ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఈ కిందివిధంగా ఉన్నాయి.

2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ MT :
* స్మార్ట్ : రూ. 8.10 లక్షలు
* స్మార్ట్+ : రూ. 9.10 లక్షలు
* ప్యూర్ : రూ. 9.70 లక్షలు
* క్రియేటివ్ : రూ. 11 లక్షలు
* క్రియేటివ్+ : రూ. 11.70 లక్షలు
* Fearless : రూ.12.50 లక్షలు
* Fearless+ : రూ. 13 లక్షలు

Tata Nexon Facelift Launched At Rs 8.1 Lakh, Check Full Details

Tata Nexon Facelift Launched At Rs 8.1 Lakh, Check Full Details

2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ AMT
* క్రియేటివ్ – రూ. 11.70 లక్షలు

2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ పెట్రోల్ DCA
* క్రియేటివ్ – రూ. 12.20 లక్షలు

2023 టాటా నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్ MT
* ప్యూర్ – రూ. 11 లక్షలు

2023 టాటా నెక్సాన్ 1.5-లీటర్ డీజిల్ AMT
* క్రియేటివ్ – రూ. 13 లక్షలు

వేరియంట్ వారీగా 2023 Tata Nexon.ev ధరలు (ఎక్స్-షోరూమ్, ఆల్-ఇండియా) ఇలా ఉన్నాయి.

2023 Tata Nexon.ev MR  
* Creative+ : రూ. 14.74 లక్షలు
* Fearless : రూ.16.19 లక్షలు
* Fearless + : రూ. 16.69 లక్షలు
* Fearless + S : రూ. 17.19 లక్షలు
* Empowered : రూ. 17.84 లక్షలు

2023 Tata Nexon.ev LR 
* Fearless : రూ. 18.19 లక్షలు
* Fearless + : రూ. 18.69 లక్షలు
* Fearless + S : రూ. 19.19 లక్షలు
* Empowered+ : రూ. 19.94 లక్షలు

ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్య భాగస్వామ్యానికి (వాహన్ రిజిస్ట్రేషన్ ప్రకారం.. క్యూ1 FY24లో 76శాతం) నెక్సాన్ EV గణనీయమైన తేడాతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ కొత్త మోడల్ దాని ICE కౌంటర్ నుంచి అనేక డిజైన్లను కలిగి ఉంది.

Read Also : New Tata Nexon EV : కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ ఈవీ కారు వచ్చేస్తోంది.. హ్యుందాయ్, మహీంద్రా, మారుతీలకు దబ్బిడి దిబ్బిడే..!