KTR : ప్రధాని మోదీకి పాలమూరులో కాలు మోపే అర్హత లేదు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్

మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

KTR : ప్రధాని మోదీకి పాలమూరులో కాలు మోపే అర్హత లేదు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్

KTR Angry BJP and Modi

KTR – Modi : బీజేపీ, ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాలమూరులో కాలు మోపే అర్హత ప్రధాని మోదీకి లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సమయంలో ప్రశ్నలు సంధిస్తామని చెప్పారు. తెలంగాణపై ప్రధాని ఎందుకు విషం చిమ్ముతున్నారు? తెలంగాణ పుట్టుకను ఎందుకు అవమాన పరుస్తారు? అని ప్రశ్నించారు. అమృతకాలంలో పార్లమెంట్ సమవేశాల్లో తెలంగాణపై విషం చిమ్ముతారా అని నిలదీశారు.

14 ఏళ్ళు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచుకున్నామని తెలిపారు. విభజన హామీలకు పాతర వేశారని మండిపడ్డారు. మీ దిక్కు మాలిన తనంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా కొంతమందికి పాత అలవాట్లు పోవడం లేదన్నారు. దేశానికి న్యాయకత్వం వహిస్తున్న ఎన్డీఏకు డీఎన్ఏలోనే తెలంగాణ అంటే విషం చిమ్మే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

KTR : మతం పేరుతో మంట పెడుతున్నారు, 11సార్లు ఛాన్స్ ఇస్తే దేశానికి ఏం చేశారు- ప్రధాని మోదీ, సోనియా గాంధీలపై కేటీఆర్ ఫైర్

మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. సర్కారియా కమిషన్ ప్రకారం రాజకీయాల్లో ఉన్న వారు ఆ పదవికి అర్హులు కారని పేర్కొన్నారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా అని అన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం పెత్తనం చేస్తోందని విమర్శించారు.

బీజేపీ నేతలకు ఎన్నో రాష్ట్రాల్లో మండలికి అవకాశం ఎలా దక్కిందని ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు ఒక నీతి.. ప్రాంతీయ పార్టీలకు మరో నీతా అని నిలదీశారు. కేంద్రమంత్రుల్లో ఒకే ఒక్క అన్ ఫిట్ మంత్రి కిషన్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటాయని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల్లో ఉన్న నేత దాసోజు శ్రవణ్ కాగా, జాతీయ స్థాయిలో పని చేసిన చరిత్ర సత్యనారాయణకు ఉందన్నారు.