RJD Leader : రిజర్వేషన్లు లిప్ స్టిక్, బాబ్డ్ హెయిర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి : ఆర్జేడీ నేత వ్యాఖ్యలు

మహిళా రిజర్వేషన్ల చట్టం లిప్ స్టిక్ వేసుకుని బాబ్డ్ హెయర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి అంటూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

RJD Leader : రిజర్వేషన్లు లిప్ స్టిక్, బాబ్డ్ హెయిర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి : ఆర్జేడీ నేత వ్యాఖ్యలు

RJD Leader Abdul Bari Siddiqui

RJD Leader Abdul Bari Siddiqui..women reservation law: మహిళా రిజర్వేషన్ల చట్టంపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టం లిప్ స్టిక్ వేసుకుని బాబ్డ్ హెయర్ వేసుకునే మహిళలకే ఉపయోగపడతాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముజఫర్ పూర్ లోని బీబీగంజ్ లోని ఓ ఆడిటోరింలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అబ్దుల్ సిద్ధికి మాట్లాడుతు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ల చట్టం లిప్ స్టిక్ వేసుకున్న మహిళలకే ప్రయోజనమని వ్యాఖ్యానించారు.

ఈ చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవటంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓబీసీ మహిళలకు కోటా లేని అంశంపై కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. వెనుకబడిన వర్గాల మహిళలకు ఈ చట్టం ఉపయోగపకపోవటం చాలా దారుణమన్నారు. వారికి కూడా కోటా కల్పించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిజంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా ఇవ్వాలని అన్నారు. అలా ఇవ్వకుంటే రిజర్వేషన్ల పేరుతో లిప్ స్టిక్ వేసుకున్ని బాబ్డ్ హెయిర్ వేసుకున్న మహిళలు పార్లమెంట్ కు వస్తారు అంటూ అబ్ధుల్ సిద్ధిఖి చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి.

Hemoprova Chutia : 700 పేజీల భగవద్గీతను బట్ట మీద నేసిన చేనేత కళాకారిణి.. ఒకసారి చూసేయండి

కాగా ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు..సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.కనీసం లోక్ సభ ఎన్నికల వరకు టీవీ,సోషల్ మీడియాలను దూరంపెట్టాలని అన్నారు.ఇటువంటివాటికి అనుకూలంగా ఉండేవారు ప్రధాని మోదీ సంకేతాలను అనుగుణంగా వ్యవహరిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.లోక్ సభ ఎన్నికల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని సోషలిస్టులు అందరు ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

కాగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది.ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు ప్రస్తుతం చట్టంగా మారింది. కానీ ఇది ఇప్పట్లో అమలులోకి రావటంలేదు. ఇప్పట్లో అమలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సింది. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయడం సాధ్యమని తెలిపింది.