Daggubati Raja : వెంకటేష్ తమ్ముడు సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు.. చాలా గ్యాప్ తర్వాత ‘స్కంద’తో..

నటుడు దగ్గుబాటి రాజా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్న నటుడు. 20 ఏళ్లుగా స్క్రీన్‌కి దూరంగా ఉన్నారు. అసలు ఆయన సినిమాలు మానేయడానికి కారణం ఏంటి? ఏం చేస్తున్నారు?

Daggubati Raja : వెంకటేష్ తమ్ముడు సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు.. చాలా గ్యాప్ తర్వాత ‘స్కంద’తో..

daggubati raja

Daggubati Raja :  విక్టరీ వెంకటేష్ కజిన్ దగ్గుబాటి రాజా చాలామందికి గుర్తుండి ఉంటారు. 80, 90 లలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించారు. అసలు రాజా సినిమాలకు దూరమవ్వడానికి కారణం ఏంటి?

Amrutha Chowdary : స్కంద సినిమాలో రామ్‌కి చెల్లెలిగా నటించింది ఎవరో తెలుసా? భీమవరం అమ్మాయి.. సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్..

దగ్గుబాటి రాజా అసలు పేరు దగ్గుబాటి వెంకటేష్..రాజాకి బాబాయ్ అయిన మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు వల్ల రాజాను సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేసారట. 1981 లో ‘పాక్కు వెతలై’ తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన దగ్గుబాటి రాజా చాలా సినిమాల్లో హీరోగా, నటుడిగా తమిళం, మళయాళం, తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగులో సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, సంకెళ్లు, ఏడుకొండల స్వామి వంటి సినిమాలతో పాటు తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన సతీ లీలావతి, లవ్ బర్డ్స్ వంటి సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. అయితే 2000 లో ‘కన్నుక్కు కన్నగ’ అనే తమిళ సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు.

దగ్గుబాటి రాజా ఏమయ్యారు? ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యారు? చాలామంది ప్రేక్షకులకు తెలియలేదు. 2019 లో క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో స్క్రీన్ పై కనిపించిన రాజాను చూసి ప్రేక్షకులు స్టన్ అయ్యారు. అదే సంవత్సరం ‘ఆదిత్య వర్మ’ అనే తమిళ సినిమాలో కూడా కనిపించారు. 2023 లో స్కందతో మళ్లీ నటుడిగా ఫామ్ లో దిగారు దగ్గుబాటి రాజా. హీరో రామ్ తండ్రి పాత్రలో చక్కని అభినయం ప్రదర్శించారని ప్రశంసలు అందుకుంటున్నారు.

Skanda : రామ్ పోతినేని ‘స్కంద’ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడు..?

ఇదంతా సరే దగ్గుబాటి రాజా తెరకు దూరమై ఏం చేస్తున్నారు? 2000 తర్వాత నటుడిగా అవకాశాలు వచ్చినా పాత్రలు నచ్చక .. ఉన్న ఇమేజ్ ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీకి దూరమయ్యారట. బిజినెస్ మీదనే మొత్తం ఫోకస్ పెట్టిన రాజా ఫ్లోరింగ్, గ్రానైట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారట. రాజా కూతురు ఆర్టిటెక్ట్ గా ఉంటే.. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడట. వాళ్లిదరికీ సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదని చెప్పారాయన. మొత్తానికి మంచి క్యారెక్టర్లు రాక సినిమాలకు దూరంగా ఉన్న రాజాకు ఇప్పటి డైరెక్టర్లు మంచి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.