Atchannaidu: ఈ తేదీలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు: అచ్చెన్నాయుడు

ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: ఈ తేదీలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు: అచ్చెన్నాయుడు

Atchannaidu

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ఈ నెల 9వ తేదీలోపు బయటకు వస్తారని తాము భావిస్తున్నట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అప్పటివరకు తమ నిరాహార దీక్షలు, నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఒకవేళ చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియలో మరింత జాప్యం జరిగితే తాము మళ్లీ ఈ నెల 10వ తేదీ నుంచి నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో దాదాపు 120 మంది చనిపోయారని చెప్పారు. మరోవైపు, ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కి సంబంధం లేదని నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.

ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ నేతల తీరు నిన్నటి వాదనలతో బహిర్గతమైందని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందని స్పష్టమైందని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండాలని జగన్ భావిస్తున్నారని చెప్పారు.

అందుకే హడావుడిగా జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్టు బీజేపీకి తెలిసి జరిగిందా? అని అన్నారు. ఆ అరెస్టు అక్రమమని తెలిసినప్పటికీ ఆ పార్టీ నేతలు కనీసం స్పందించకపోవటం ఏంటని నిలదీశారు.

Union cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్