వాళ్లతో పొత్తుకోసమే.. ఢిల్లీలో జగన్ ధర్నాపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టింది వాళ్లతో పొత్తుకోసమేనని మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు

వాళ్లతో పొత్తుకోసమే.. ఢిల్లీలో జగన్ ధర్నాపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

Minister Payyavula Keshav

Updated On : July 25, 2024 / 12:05 PM IST

Payyavula Keshav : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలపై సభ్యులు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అయితే, అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి పయ్యావుల కేశవ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఢిల్లీలో ధర్నాచేసింది ఏపీలో శాంతిభద్రతల అంశంపై కాదని.. ఆ సాకుతో వారితో పొత్తుకోసం జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేశాడంటూ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

Also Read : 36 హత్యలు జరిగితే ఒక్కరినే‌ ఎందుకు పరామర్శించారు?: జగన్‌పై మంత్రి అనిత ఫైర్

పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే సభలో చర్చించాలి. ఢిల్లీ రోడ్లమీద శాంతి భద్రతలపై గగ్గోలు పెట్టడం దేనికి జగన్ అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన జగన్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావొచ్చు.. సభలోకి వచ్చి శాంతి భద్రతల అంశంపై జగన్ చర్చించాలని పయ్యావుల కోరారు. దీనికితోడు ఇవాళే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. జగన్ కు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి ఇండియా కూటమితో చర్చలకు వెళ్లినట్లుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్లు లేదని పయ్యావుల అన్నారు.

Also Read : ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి కేసీఆర్