America : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికా న్యూజెర్సీలో ప్రారంభం

ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది. అమెరికా వ్యాప్తంగా 12 వేల మందికిపైగా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో సుమారు 10 వేల విగ్రహాలను ఉపయోగించారు.

America : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికా న్యూజెర్సీలో ప్రారంభం

world second largest Hindu temple

America Largest Hindu Temple : భారతదేశంలో హిందూ దేవాలయాలు ఉండటం సర్వసాధారణం. కానీ, భారత్ వెలుపల ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. అమెరికాలో రెండో అతి పెద్ద దేవాలయం ప్రారంభం అయింది. ఆదివారం (అక్టోబర్ 8,2023)న  న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రపంచంలోనే అతి పెద్ద రెండో హిందూ దేవాలయం ప్రారంభమైంది. ఈ స్వామినారాయణ్ అక్షర్ ధామ్ గా పిలుచుకునే ఈ మహా మందిరంలో అక్టోబర్ 18 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

ఈ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది. ఇటలీ, బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపు రాయితో ఈ మందిరాన్ని నిర్మించారు. 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహం లింకన్ లాంటి నాయకుల చిత్రాలతో తీర్చిదిద్దారు.

Muslim Couple Married In Hindu Temple : హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి .. పెళ్లి పెద్దలుగా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు

126 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తు : 42 అడుగులు, వెడల్పు : 87 అడుగులు, పొడవు : 133 అడుగులు) తో నిర్మించారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం.. ఈ ఆలయాన్ని నిర్మితమైంది. ఆలయ నిర్మాణం 2011 నుంచి 2023 వరకు సుమారు 12 ఏళ్లు పట్టింది.  అమెరికా వ్యాప్తంగా 12 వేల మందికిపైగా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు.  ఆలయ నిర్మాణంలో సుమారు 10 వేల విగ్రహాలను ఉపయోగించారు.

అంతేకాకుండా పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై కళారూపాలు చెక్కించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, 9 శిఖరాలు, 9 పిరమిడ్ లు, ఉన్నాయి.  ఆలయంలో సంప్రదాయ రాతి వాస్తు శిల్పి అతి పెద్ద దీర్ఘవృత్తకార గోపురం ఉంది. దీన్ని 1000 సంవత్సరాలు ఉండేలా రూపొందించారు.

Pakistan floods : పాక్‌లో మతసామరస్యం .. వరదల నుంచి కాపాడి వందలాది ముస్లింలకు హిందూ దేవాలయంలో ఆశ్రయం

సున్నపురాయి, గ్రానైట్, గులాబీ ఇసుక రాయి, పాలరాయి సహా దాదాపు 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. భారత్, టర్కీ, గ్రీస్, ఇటలీ, చైనా సహా ప్రపంచలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించారు. దేవాలయం వద్ద బ్రహ్మ కుండ్ అని పిలువడే సంప్రదాయ భారతీయ మెట్ల బాబి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరుల నుండి నీటిని కలిగివుంది.