Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…

ఇజ్రాయెల్ వీర వనిత 25 ఏళ్ల ఇన్‌బార్ లీబెర్‌మాన్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు ఆ దేశ మహిళా ఇన్‌బార్ లీబెర్‌మాన్ వారిని అడ్డుకొని 25 మంది ఉగ్రవాదులను హతమార్చి ఇజ్రాయెల్ వీర వనితగా పేరొందారు...

Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…

Israeli woman Inbar Lieberman

Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 ఏళ్ల ఇన్‌బార్ లీబెర్‌మాన్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినపుడు ఆ దేశ మహిళా ఇన్‌బార్ లీబెర్‌మాన్ వారిని అడ్డుకొని 25 మంది ఉగ్రవాదులను హతమార్చి ఇజ్రాయెల్ వీర వనితగా పేరొందారు. వీరోచిత ఇజ్రాయెల్ మహిళ కిబ్బట్జ్‌ను హమాస్ ఉగ్రవాదుల నుండి కాపాడింది. ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్న ఇన్‌బార్ లీబెర్‌మాన్ ఉగ్రవాదులను నిర్మూలించి తీవ్రవాద దాడి నుంచి కిబ్బట్జ్ నగరాన్ని రక్షించడంలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు.

 ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్సులో సెక్యూరిటీ కోఆర్డినేటర్  ఇన్‌బార్ లీబెర్‌మాన్

ఇన్‌బార్ లీబెర్‌మాన్ 2022 డిసెంబర్ నెల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్సులో సెక్యూరిటీ కోఆర్డినేటరుగా పనిచేస్తున్నారు. 25 ఏళ్ల లీబెర్ మాన్ కళ్లు పచ్చరంగులో తీక్షణంగా ఉన్నాయి.ఆమె జుట్టు గోధుమరంగులో ఉంది. ఈమె హైస్కూలు చదువు అయిపోయాక ఇజ్రాయెల్ ఆర్మీలో చేరి అల్మా ఉమెన్స్ లీడర్ షిప్ అకాడమీలో శిక్షణ పొందారు. ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాద దాడి ప్రారంభమైనపుడు తెల్లవారుజామున అసాధారణ పేలుళ్లను ఆమె విన్నారు.

Also Read :Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం

పేలుళ్లు విన్న వెంటనే వీర వనిత లైబర్ మాన్ ఆయుధగారాన్ని తెరచి 12 మంది తన సభ్యుల భద్రతా బృందానికి తుపాకులను పంపిణీ చేశారు. లీబర్ మాన్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి స్వయంగా ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇన్ బార్ బృందంలోని కిబ్బట్జ్ నివాసితుల బృందం నాలుగు గంటల్లో 20మంది ఉగ్రవాదులను చంపారు. హమాస్ ఉగ్రవాదుల దాడి సందర్భంగా లీబర్ మాన్ తీసుకున్న చర్యలతో ప్రాణనష్టాన్ని నివారించగలిగారు.

Also Read :Train Accident : బీహార్‌లో పట్టాలు తప్పిన రైలు…నలుగురి మృతి, 50 మందికి గాయాలు

ఇన్ బార్ అసాధారణ వీరత్వానికి ఇజ్రాయెల్ బహుమతికి అర్హురాలని సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పారు. 25 మంది టెర్రరిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్ అమ్మాయి ఇన్‌బార్ లీబెర్‌మాన్ ధైర్యసాహసాల కథ నేడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇజ్రాయెల్ సైన్యంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందమైన యువతులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వార్తల్లో నిలుస్తున్నారు.