Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం

ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు....

Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం

Operation Ajay

Operation Ajay : ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. యుద్ధ బాధిత ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. దీని కోసం ప్రత్యేక చార్టర్ విమానాలను రంగంలోకి దించారు. ప్రస్తుతం పాలస్థీనా గ్రూప్ హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దేశంలో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని చెప్పారు.

Also Read : Train Accident : బీహార్‌లో పట్టాలు తప్పిన రైలు…నలుగురి మృతి, 50 మందికి గాయాలు

కేరళ రాష్ట్రానికి చెందిన 7,000 మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు సీఎం జైశంకర్‌కు లేఖ రాశారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 84 మంది వ్యక్తుల గురించి తమకు సమాచారం అందిందని తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా అక్టోబర్ 8వతేదీన ముంబయికి తిరిగి వచ్చారు.

Also Read :Bandi Sanjay : ఒవైసీ ఆశీస్సులతో నన్ను ఓడించాలనుకుంటున్నారు- బండి సంజయ్

యుద్ధం ప్రారంభమైన సమయంలో ఆమె హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది.