Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్ హాయిగా నిద్రపోతోంది.. ఒకవేళ అది లేవాలనుకుంటే..: ఇస్రో చీఫ్

సెప్టెంబరు 2న ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై కూడా సోమనాథ్ అపే‌డేట్ ఇచ్చారు.

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్ హాయిగా నిద్రపోతోంది.. ఒకవేళ అది లేవాలనుకుంటే..: ఇస్రో చీఫ్

Chandrayaan-3

Isro chief S Somanath: చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ జాబిల్లిపై తన పనిని సమర్థవంతంగా పూర్తిచేసి హాయిగా నిద్రపోతోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందడం లేదని తెలిపారు.

అయినప్పటికీ తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని సోమనాథ్ చెప్పారు. ల్యాండర్ తనకు తాను నిద్రలేవాలని అనుకుంటే లేవనిద్దామని అన్నారు. అప్పటి వరకు మనం ఎదురుచూద్దామని చెప్పారు. జాబిల్లిపై ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటే పనిచేసేలా వాటిని ఇస్రో అభివృద్ధి చేసింది.

జాబిల్లిపై దిగిన తర్వాత అవి అక్కడ తిరుగుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయని సోమనాథ్ అన్నారు. సెప్టెంబరు 2న ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై కూడా సోమనాథ్ అపే‌డేట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్య ఎల్‌-1ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

వ్యోమనౌక చాలా సమర్థంగా పనిచేస్తోందని, లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి వెళ్లే దిశలో ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబరు 2 నుంచి దాదాపు 125 రోజులు అది ప్రయాణించి లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి చేరుకుంటుందని దాన్ని ప్రయోగించిన సమయంలోనే ఇస్రో తెలిపింది. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో వ్యోమనౌక ఆ కక్ష్యను చేరే అవకాశం ఉంది.

ISRO Chief Somanath : చంద్రయాన్-3తో మన సత్తాఏంటో వాళ్లకు తెలిసింది.. ఆ టెక్నాలజీని ఇవ్వాలని అడిగారు