Chandrayaan-3: జాబిల్లిపై మన ల్యాండర్‌, రోవర్‌కి పొంచి ఉన్న ముప్పు.. ఏం జరుగుతుందో తెలుసా?

మైక్రోమీటోరాయిడ్లు అంటే చిన్న పాటి రాళ్లు, లోహాలు. సౌర వ్యవస్థ నుంచి పుట్టుకొచ్చిన..

Chandrayaan-3: జాబిల్లిపై మన ల్యాండర్‌, రోవర్‌కి పొంచి ఉన్న ముప్పు.. ఏం జరుగుతుందో తెలుసా?

Chandrayaan-3

Latest Update on Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా భారత కీర్తి ప్రతిష్ఠలను మరోసారి జగద్వితం చేసిన ఇస్రో.. జాబిల్లిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇంకా ఆశలు వదులుకోలేదు. ల్యాండర్ ప్రస్తుతం నిద్రాణ స్థితితో ఉన్న విషయం తెలిసిందే. దాన్ని నిద్రలేపే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని కొందరు నిపుణులు అంటుండగా, దాన్ని ఇక మర్చిపోవాలని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ పరిస్థితి ఏంటన్న విషయంపై పలు విశ్లేషణలు వస్తున్నాయి.

ఇక జీవితాంతం అది స్లీప్ మోడ్‌లోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే, స్లీప్ మోడ్‌లో ఉన్న సమయంలోనే ల్యాండర్, రోవర్ ధ్వంసమైపోయే ముప్పూ ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే జాబిల్లి బయటి నుంచి కూడా ల్యాండర్, రోవర్‌కు ప్రమాదం పొంచి ఉంది.

ఇప్పుడు పొంచి ఉన్న ముప్పు ఏంటి?
మైక్రోమీటోరాయిడ్ల వల్ల ల్యాండర్, రోవర్‌కు ప్రమాదం పొంచి ఉంది. మైక్రోమీటోరాయిడ్లు అంటే చిన్న పాటి రాళ్లు, లోహాలు. సౌర వ్యవస్థ నుంచి పుట్టుకొచ్చిన అతి పెద్ద లోహాలు, రాళ్ల వంటి నుంచి ఊడిపోయి అవి చిన్న ముక్కలుగా జాబిల్లి ఉపరితలంపై పడుతుంటాయి. ఇవే మైక్రోమీటోరాయిడ్లు.

వీటి గురించి ఇస్రో అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ల్యాండర్, రోవర్‌ను మైక్రోమీటోరాయిడ్లు ఢీ కొట్టే ముప్పు ఉందని చెప్పారు. గతంలో జాబిల్లిపై అపోలో సహా పలు మిషన్ల విషయంలో ఇదే జరిగిందని అన్నారు.

సాధారణంగా ల్యాండర్, రోవర్‌కు తుప్పు పట్టేలా చేసే వాతావరణం జాబిల్లిపై లేకపోయినప్పటికీ మైక్రోమీటోరాయిడ్లు పడే సమయంలో, లూనార్ నైట్ (14 రోజుల రాత్రి)లో ఉండే ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని మరో శాస్త్రవేత్త కూడా చెప్పారు.

అయినప్పటికీ చివరకు ల్యాండర్, రోవర్‌కు చివరకు ఏం జరుగుతుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కాగా, చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై తన పనిని సమర్థవంతంగా పూర్తిచేసి ఇప్పుడు హాయిగా నిద్రపోతోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇటీవలే చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రస్తుతం సిగ్నల్స్ అందడం లేదు.

Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్ హాయిగా నిద్రపోతోంది.. ఒకవేళ అది లేవాలనుకుంటే..: ఇస్రో చీఫ్