Bhopal Gas Tragedy : దేశాన్ని కుదిపేసిన భోపాల్ గ్యాస్ లీక్ పై వెబ్ సిరీస్.. ఘటన జరిగిన 39 ఏళ్ళ తర్వాత..

. భోపాల్ గ్యాస్ లీకేజ్ అప్పడు దేశాన్ని కుదిపేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తులో ఒకటిగా మిగిలింది.

Bhopal Gas Tragedy : దేశాన్ని కుదిపేసిన భోపాల్ గ్యాస్ లీక్ పై వెబ్ సిరీస్.. ఘటన జరిగిన 39 ఏళ్ళ తర్వాత..

Web Series on Bhopal Gas Tragedy in Netflix Coming Soon

Bhopal Gas Tragedy : 1984 డిసెంబర్‌ 2, 3 తేదీల్లో భోపాల్‌ లోని యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) ప్లాంట్ లో మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషవాయువు లీక్ అయి భారీ ప్రమాదం సంభవించింది. భోపాల్ గ్యాస్ లీకేజ్ ఘటన వల్ల కొన్ని వేల మంది చనిపోగా దాదాపు 6 లక్షల మందికి పైగా ఆరోగ్యంపై ప్రభావితం చూపించింది. కొన్ని సంవత్సరాల పాటు ఈ గ్యాస్ లీకేజ్ ప్రభావం అక్కడ చుట్టూ పక్కల ప్రాంతాల్లో కనిపించింది. భోపాల్ గ్యాస్ లీకేజ్ అప్పడు దేశాన్ని కుదిపేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తులో ఒకటిగా మిగిలింది.

ఈ ఘటన జరిగి 39 ఏళ్ళు కావొస్తుంది. ఇటీవల ఇలాంటి పలు సంఘటనలపై సిరీస్ లు, సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనపై వెబ్ సిరీస్ రాబోతుంది. అయితే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ దగ్గర్లోనే ఉండే ఎంతోమంది రైల్వే ఉద్యోగులు సహాయం చేసి పలువురు ప్రాణాలను కాపాడారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగుల నేపథ్యం నుంచి ఈ సిరిస్ ని తీయనున్నారు. ఈ సిరీస్ కి ‘ది రైల్వే మెన్'(The Railway Men) అనే పేరు పెట్టారు.

Also Read : Anirudh Ravichander : అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలుసా? అందుకేనా ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..

తాజాగా ఈ సిరీస్ అనౌన్స్మెంట్ చేస్తూ టైటిల్ ప్రకటించారు. ఇందులో నటుడు మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. డైరెక్టర్ శివ్ రావేలి ఈ సిరీస్ ని బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. ‘ది రైల్వే మెన్’ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుందని ప్రకటించారు.