Anirudh Ravichander : అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలుసా? అందుకేనా ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..

తమిళ్ స్టార్ హీరోలందరికీ సినిమాల్లో గుర్తుండిపోయే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు అనిరుద్. ఇటివలే జైలర్, లియో సినిమాలతో అదరగొట్టాడు.

Anirudh Ravichander : అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలుసా? అందుకేనా ఇంత బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు..

Music Director Anirudh Ravichander Study Details

Anirudh Ravichander : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటే అందరికి తెలుసు. తమిళ్ సంగీత దర్శకుడైనా సౌత్, బాలీవుడ్ లో కూడా అనిరుధ్ పరిచయమే. కేవలం తమిళ్ సినిమాలకే కాక తెలుగులో కూడా మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ధనుష్ 3 సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ మొదటి పాట వై దిస్ కొలవరి తోనే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా, సింగర్ గా ఫుల్ బిజీ అయ్యాడు అనిరుధ్. దాదాపు 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ చేతిలో ప్రస్తుతం ఓ డజను సినిమాలకు పైగానే ఉన్నాయి.

ఇక సినిమాల్లో పాటలకు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడని పేరు ఉంది. తమిళ్ స్టార్ హీరోలందరికీ సినిమాల్లో గుర్తుండిపోయే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు అనిరుద్. ఇటివలే జైలర్, లియో సినిమాలతో అదరగొట్టాడు. అసలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా హిట్ అయ్యేదే కాదేమో అన్నంతగా మెప్పించాడు అనిరుధ్. అయితే ఇంత బాగా సంగీతం ఇస్తున్న అనిరుధ్ ఏం చదువుకున్నాడో తెలుసా?

సాధారణంగా సంగీత దర్శకులు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకొని, వివిధ సంగీత వాయిద్యాలు నేర్చుకొని మ్యూజిక్ డైరెక్టర్స్ గా మారతారు. అనిరుధ్ కూడా ఇవన్నీ చేశాడు. కానీ వీటితో పాటు ఎక్స్ట్రా గా కొన్ని కోర్సులు కూడా చేశాడు. అనిరుధ్ ఓ పక్క సంగీతం నేర్చుకుంటూనే మరోపక్క డిగ్రీ కూడా చదివాడు. అనంతరం లండన్(London) లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీ లో పియానో నేర్చుకొని, అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో కూడా పనిచేసాడు. అనంతరం చెన్నైలో(Chennai) సౌండ్ ఇంజనీరింగ్(Sound Engineering) కోర్సు కూడా చేశాడు. అందుకే మ్యూజిక్ తో పాటు సౌండ్ మీద బాగా పట్టు ఉంది.

Also Read : Muralidhar Goud : రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను అంటూ ఏడ్చేసిన నటుడు..

ఏ సౌండ్ ఎక్కడ కరెక్ట్ గా వాడాలో, ఎంత లెవల్లో వాడాలో అనిరుధ్ కి బాగా తెలుసు. దీంతో కేవలం పాటలకు సంగీతం మాత్రమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై పట్టు సాధించి ఇప్పుడు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు అనిరుధ్. సంగీతం ఇవ్వడమే కాకుండా సింగర్ గా కూడా పాటలతో మెప్పిస్తున్నాడు అనిరుధ్. ఇక అనిరుద్ ఫ్యామిలీ కూడా సినీ పరిశ్రమే. అనిరుద్ తాతయ్య తమిళ్ డైరెక్టర్. రజినీకాంత్ మామయ్య వరుస అవుతారు.