Muralidhar Goud : రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను అంటూ ఏడ్చేసిన నటుడు..

ఇటీవలే భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలో ఓ రాజకీయ నాయకుడు పాత్రలో నటించిన మురళీధర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Muralidhar Goud : రిటైర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాను అంటూ ఏడ్చేసిన నటుడు..

DJ Tillu Fame Muralidhar Goud get Emotional in a Interview

Muralidhar Goud : మురళీధర్ గౌడ్ అంటే ఎవరూ గుర్తుపట్టరేమో. కానీ డీజే టిల్లులో(DJ Tillu) ఫాదర్ క్యారెక్టర్ అంటే అందరూ గుర్తుపడతారు. డీజే టిల్లు, బలగం(Balagam), భగవంత్ కేసరి.. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మురళీధర్ గౌడ్. ప్రస్తుతం మాస్ ఫాదర్ పాత్రలకు, తెలంగాణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యారు మురళీధర్ గౌడ్. అయితే ఈయన జాబ్ కెరీర్ అయిన తర్వాత రిటైర్ అయ్యాక సినిమాల్లో సక్సెస్ అయ్యారు.

మురళీధర్ గౌడ్ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో గవర్నమెంట్ ఉద్యోగం సాధించి 27 ఏళ్ళు అందులోనే పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయి విశ్రాంతి తీసుకునే సమయంలో నాటకాలు, సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.

Also Read : Varun – Lavanya : వరుణ్, లావణ్య శుభలేఖ చూశారా.. మ్యారేజ్, రిసెప్షన్ డేట్ ఎప్పుడంటే..?

ఇటీవలే భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలో ఓ రాజకీయ నాయకుడు పాత్రలో నటించిన మురళీధర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రిటైర్ అయ్యాకే నటుడు అవ్వాలని కోరికతో సినిమా రంగానికి వచ్చాను. మొదట్లో సినిమా ఛాన్సులు రాలేదు. కొన్ని సీరియల్స్ లో నటించాను. అక్కడ గుర్తింపు వచ్చాక సినిమాల్లో ప్రయత్నించాను. డీజే టిల్లు, బలగం సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు భగవంత్ కేసరిలో బాలయ్య గారితో చేసాను. అంత పెద్ద నటుడైనా చాలా బాగా చూసుకున్నారు. పిలిచి మరీ మాట్లాడతారు, పలకరిస్తారు. రిటైర్ అయ్యాక ఇలా సక్సెస్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.