Temples Re-Open : వీడిన చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి తెరుచుకున్న ఆలయాలు, దర్శనానికి భక్తులకు అనుమతి

ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.

Temples Re-Open : వీడిన చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి తెరుచుకున్న ఆలయాలు, దర్శనానికి భక్తులకు అనుమతి

Temples Reopened

Temples Re-Open Allowed Devotees : పాక్షిక చంద్రగ్రహణం వీడటంతో తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఆలయాలు తెరుచుకున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం సమయంలో మూత పడిన ఆలయాలను తిరిగి చెరిచారు. సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయాలను తిరిగి చెరిచారు. భక్తులను ఆలయాలకు అనుమతిస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడిన తిరుమలలో శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ గ్రహణం వీడటంతో మళ్లీ తెరుచుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తెరిచిన అర్చకులు సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతించారు.

ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజుస్వామి, శ్రీకోదండరామస్వామి, శ్రీనివాస మంగాపురంలో శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలను శుద్ధి చేసిన అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న (శనివారం) యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి దేవస్థానం ఇవాళ (ఆదివారం) తెరుచుకుంది.

Chandra Grahan 2023 : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. పాటించాల్సిన నియమాలు ఇవే

ఇవాళ ఉదయం యధావిధిగా ఆలయాన్ని తెరిచి శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారి దర్శనాల కోసం భక్తులను అనుమతించారు. భద్రాచలంలో శ్రీరాములవారి ఆలయంలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నారు. గుడి సంప్రోక్షణ అనంతరం అంతరాలయంలో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఇవాళ ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని సంప్రోక్షణ చేసి ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తున్నారు. చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.