Chandra Grahan 2023 : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. పాటించాల్సిన నియమాలు ఇవే

అక్టోబర్ 28 వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 29 వ తేదీ ప్రారంభమవుతున్న సమయంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఏ రాశులకు గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది? గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి?

Chandra Grahan 2023 : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. పాటించాల్సిన నియమాలు ఇవే

Chandra Grahan 2023

Chandra Grahan 2023 : శనివారం అక్టోబర్ 28 వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 29 వ తేదీ ప్రారంభమవుతున్న సమయంలో అశ్వనీ నక్షత్ర యుక్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. చంద్రగ్రహణం ఏ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది.. ఆ సమయంలో పాటించాల్సిన నియమాలేంటో ఓసారి చూద్దాం.

భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం శనివారం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. దాదాపుగా గంట 19 నిముషాల పాటు ఉండనుంది. 1.05 నిముషాలకు ప్రారంభమై 2.23 నిముషాల పాటు కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మంగోలియా, ఆఫ్గనిస్తాన్, చైనా, ఇరాన్, టర్కీ, అల్జీరియా, జర్మనీ, పోలండ్, నైజీరియా, బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, కొరియాతో పాటు బ్రెజిల్‌లోనూ చూడవచ్చును.

Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు పాటించాల్సిన ఆహార నియమాలు

చంద్రగ్రహణం ఏర్పడటానికి ముందు మూడు ఝాములు అంటే 9 గంటల ముందు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ముసలివారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, పిల్లలు, గర్భిణులు గ్రహణానికి నాలుగు గంటల ముందు వరకు ఆహారం తీసుకోవచ్చును. ఇక ఈ గ్రహణం అశ్వని, మఘ, మూల నక్షత్రం వారు చూడకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.

మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశుల వారికి శుభఫలాన్ని, సింహ, తుల, ధను, మీన రాశుల వారికి మధ్య ఫలాన్ని, కన్య, మకర, సింహ, తుల, ధను, మీన రాశుల్లో జన్మించిన వారికి ఈ గ్రహణం అధమ ఫలాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా మేష, వృషభ, కన్య, మకర, సింహ, తుల, ధను, మీన రాశుల్లో జన్మించిన వారు గ్రహణం చూడకపోవడమే మంచిది.

Good Benefits From Fruits : పండ్లు వల్ల మంచి ప్రయోజనాలు పొందాలంటే తినేటప్పుడు పాటించాల్సిన 3 నియమాలు !

గ్రహణసమయంలో ఇంట్లోని ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రి, దేవతా విగ్రహాలపై దర్భలు, గరిక వేయడం ఆచారంగా పాటిస్తారు. వీటిని వేయడం వల్ల సూర్య, చంద్రుల నుండి వచ్చే చెడు కిరణాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ఇక గ్రహణ సమయంలో గాయత్రీ జపంతో పాటు పలు దేవతా స్తోత్రాలు పఠిస్తారు. గ్రహణం విడిచిన తర్వాత తప్పనిసరిగా అందరూ స్నానం చేయాలి. దగ్గర్లో నది ఉంటే అందులో స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుందట. గ్రహణ ప్రభావం ఉన్న రాశులు, నక్షత్రాలలో జన్మించిన వారు చంద్రుడు, రాహువు ప్రతిమలను దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.