Zara Patel : రష్మిక మార్ఫింగ్ వీడియోలో ఉన్న జారా పటేల్ ఎవరు?.. వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?

నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన తర్వాత ఒరిజినల్ వీడియోలో ఉన్న జారా పటేల్ స్పందించారు. అసలు జారా పటేల్ ఎవరు? ఈ వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?

Zara Patel : రష్మిక మార్ఫింగ్ వీడియోలో ఉన్న జారా పటేల్ ఎవరు?.. వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?

Zara Patel

Zara Patel : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మార్ఫింగ్ వీడియోలో ఉన్న జారా పటేల్ ఎవరు? ఇప్పుడు ఆమె గురించి చర్చ జరుగుతోంది. మరోవైపు జారా పటేల్ ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

నటి రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఒరిజినల్ వీడియోలో కనిపించిన మహిళ జారా పటేల్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. తాను ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందినట్లు చెప్పింది. ఎవరో తన వీడియోను ఉపయోగించి బాలీవుడ్ నటి మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేసారని.. దీనిపై తనకు ఎలాంటి సంబంధం లేదని జారా పటేల్ తెలిపింది. జరుగుతున్నదంతా చూసి తను చాలా డిస్ట్రబ్ అయ్యానని.. భవిష్యత్తులో మహిళలు, బాలికలు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొందని రాసుకొచ్చింది. ఇంటర్నెట్‌లో చూసేవాటిలో వాస్తవాన్ని చెక్ చేసుకోండి.. ఇక్కడ ప్రతీది నిజం కాదని’ ఆమె తన పోస్టులో చెప్పింది.

Also Read : రష్మిక ఫేక్ వీడియోపై సెలబ్రిటీలు సీరియస్.. తనకి సపోర్ట్ చేస్తున్నందుకు రష్మిక రియాక్షన్..

రష్మిక మందన్న ఎలివేటర్‌లోకి వెళ్లినట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన వీడియోలో మహిళ నిజానికి జారా పటేల్.. జారా పటేల్ బ్యాగ్రౌండ్ ఏంటంటే?

Also Read: మార్ఫింగ్ వీడియో పై రష్మిక రియాక్షన్.. చదువుతున్న టైంలో ఇలా జరిగితే..

జారా పటేల్ బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా బయో ప్రకారం ఆమె డేటా ఇంజనీర్ మరియు మెంటల్ హెల్త్ అడ్వకేట్ . అంతేకాదు అడల్ట్ కంటెంట్‌ను క్రియేట్ చేయడలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్టోబర్ 9 న జారా పటేల్ లిప్ట్‌లోకి వెళ్తినట్లు వీడియోను పోస్ట్ చేసింది. ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్న మార్ఫింగ్ వీడియోలో ఆమె ముఖాన్ని రష్మికగా మార్చేశారు.

Zara Patel post

Zara Patel post

 

View this post on Instagram

 

A post shared by Zara Patel (@zaarapatellll)

 

View this post on Instagram

 

A post shared by Zara Patel (@zaarapatellll)