Onion Farmers : ఉల్లి ధర పెరిగింది కానీ.. అయితే

రైతుల వద్ద పెద్ద మొత్తంలో ఉల్లి పండిన సమయంలో వాటికి ఏమాత్రం ధర లేదు. అయితే ప్రస్తుతం మార్కట్ లో మంచి ధర పలుకుతున్న సమయంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు లేవు. ఈ సమయంలోనే ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.

Onion Farmers : ఉల్లి ధర పెరిగింది కానీ.. అయితే

onion prices

Onion Farmers : ఉల్లి రైతులకు ఇది మంచి శుభవార్త. ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పెరిగింది. మార్కెట్లో ఉల్లి రేట్లు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఉల్లిని విక్రయిస్తున్న రైతులు బాగా లాభలు సొంతం చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం చాలా మంది రైతుల వద్ద విక్రయించేందుకు ఉల్లి ఉత్పత్తుల నిల్వలు లేవు. దీంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది.

READ ALSO : Onion Prices : దేశంలో ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు…తెరవెనుక కథ

ఉల్లిసాగులో భారత దేశం ప్రధమస్ధానంలో ఉంటుంది. రెండవ స్ధానంలో చైనా ఉంది. మహరాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను సాగు చేస్తారు. ఉల్లిపాయను రోజువారి వంటకాలలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఖరీఫ్ సీజన్ లో ఈ పంటను అధికంగా సాగుచేస్తారు. జూన్ నుండి మొదలై నవంబరు తో పంట కోతలు ముగుస్తాయి.

స్ధిరంగా ధర పలకని పంట ఏదైన ఉందంటే అది ఉల్లి అనే చెప్పాలి. రైతుల వద్ద పంట నిల్వలు ఉన్న సమయంలో సరైన ధర ఉండదు. పంట నిల్వలన్నీ వ్యాపారుల చేతిలోకి వెళ్ళాక అమాంతం ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇలాంటి పరిస్ధితి గత కొన్నేళ్ళుగా ఉల్లి రైతులకు ఎదురవుతూనే ఉంది.

READ ALSO : Narayana : ఉల్లిగడ్డ వ్యాపారులందరూ బీజేపీ మద్దతుదారులే.. కేంద్రమే కృత్రిమ కొరత సృష్టిస్తోంది : నారాయణ

రైతుల వద్ద పెద్ద మొత్తంలో ఉల్లి పండిన సమయంలో వాటికి ఏమాత్రం ధర లేదు. అయితే ప్రస్తుతం మార్కట్ లో మంచి ధర పలుకుతున్న సమయంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు లేవు. ఈ సమయంలోనే ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. ఉల్లి ధర పెరిగినా ప్రస్తుతం రైతుల్లో పెద్దగా ఆనందం కనిపించటంలేదు. ధర పెరిగినా తమకు పెద్దగా ఒరిగింది ఏమీలేదని రైతులు వాపోతున్నారు.

ఉల్లి క్వింటాల్‌కు సగటున రూ.4,800 నుంచి గరిష్టంగా రూ.5,500 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల ఈ ధర ఇంకా ఎక్కువగానే ఉంది. ఉల్లికి మంచి ధర లభిస్తున్నప్పటికీ రైతుల వద్ద విక్రయించడానికి ఉల్లి పంట ఉత్పత్తి లేదు. ఇప్పటికే వ్యాపారులు రైతుల వద్ద నుండి పంటను తక్కువ ధర ఉన్న సమయంలోనే కొనుగోలు చేసి గోడౌన్లలో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం గోడౌన్ల నుండి ఉల్లి ఉత్పత్తులను అధిక రేటు కు విక్రయించుకుని వ్యాపారులు మాత్రమే లాభాలు పొందుతున్నారని రైతుల వద్ద అంతగా ఉల్లి పంటలేదని ఉల్లి ధర పెరగడం వల్ల తమకు పెద్దగా ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు.

READ ALSO :  Onion Cultivation : ఉల్లిసాగులో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

రైతుల వద్ద ఉన్న కొద్దో గొప్పో ఉల్లి నిల్వలను ధర పెరుగుతున్న క్రమంలో ఆశతో చాలా వరకు రైతుల ఉల్లిని విక్రయించేశారు. నిల్వ ఉంచిన కొంతమేర ఉల్లి పంట కుళ్లిపోవడంతో మిగిలిన పంటనే అమ్ముకుంటూ వచ్చిన కాడికే దక్కుదలని సర్ధుకుపోతున్నారు.