Assembly Elections 2023: గెలుపోటముల నిర్ణేతలుగా రెబల్స్.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ

2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు

Assembly Elections 2023: గెలుపోటముల నిర్ణేతలుగా రెబల్స్.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ

Rajasthan Politics: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 737 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఈ సంఖ్య 830. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 100 మంది స్వతంత్ర అభ్యర్థులు తగ్గారు. అదే సమయంలో పోటీ చేస్తున్న 737 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల తిరుగుబాటు నేతలే ఎక్కువ ఉన్నారు. ఈ పోటీ వల్ల ఆ రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరగొచ్చనే విశ్లేషణలు జోరు మీద వినిపిస్తున్నాయి. తిరుగుబాటుదారుల నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

11 అభ్యర్థుల్లో 10 మంది విజయం
2018 అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్తే.. 14 మంది అభ్యర్థులు కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 12 మంది గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక 12 మంది బీజేపీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కరు కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్ నుంచి రాజ్‌కుమార్ గౌర్, మహదేవ్ సింగ్, బాబూలాల్ నగర్, బల్జీత్ యాదవ్, ఖుష్వీర్ సింగ్, సన్యామ్ లోధా, రమీలా ఖాదియా, లక్ష్మణ్ మీనా, అలోక్ బెనివాల్, రాంకేశ్ మీనా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాగా, ఓం ప్రకాష్ హూడ్లా బీజేపీ రెబల్‌గా ఉన్న ఆయన ఈసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా టికెట్ సాధించారు.

కాంగ్రెస్ రెబల్స్ అసెంబ్లీకి చేరుకుని అధికారాన్ని అనుభవిస్తున్నారు
2018 ఎన్నికల్లో గెలిచిన 13 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 12 మంది కాంగ్రెస్ రెబల్స్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మొత్తం 13 మంది స్వతంత్రులు సీఎం అశోక్ గెహ్లాట్ శిబిరంలో చేరారు. వీరిలో సీఎం గెహ్లాట్ ఈసారి 10 మందికి టిక్కెట్లు ఇచ్చారు.

బీజేపీ రెబల్స్ గెలవలేదు
బీజేపీపై తిరుగుబాటు చేసిన రెబల్స్ ఎవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. కుల్దీప్ ధంఖర్, దేవి సింగ్ షెకావత్, ధన్ సింగ్ రావత్, హేమ్ సింగ్ భదానా రెండో స్థానంలో నిలిచారు. తిరుగుబాటు చేసిన ప్రతిచోట బీజేపీ అభ్యర్థులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బన్స్వారా స్థానంలో ధన్ సింగ్ రావత్ మూడవ స్థానంలో నిలిచారు. అలాగే బీజేపీకి చెందిన హర్కు మైదా 32 వేలకు పైగా ఓట్లతో భారీ ఓటమి చవి చూశారు.

2013లో తిరుగుబాటుదారులు ఎవరు?
కాంగ్రెస్ నుంచి రాజ్‌కుమార్ గౌర్, మహదేవ్ సింగ్, బాబులాల్ నగర్, బల్జీత్ యాదవ్, ఖుష్వీర్ సింగ్, సన్యామ్ లోధా, రమీలా ఖాదియా, లక్ష్మణ్ మీనా, అలోక్ బెనివాల్, రాంకేశ్ మీనా. వీరంతా 2018 ఎన్నికల్లో గెలిచారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి భీమ్ రాజ్ బహేతి, నావల్ కిషోర్ మీనా-ఓం నారానివాల్, ప్రద్యుమాన్ సింగ్, పృథ్పాల్ సింగ్, లక్ష్మణ్‌రామ్ మేఘ్‌వాల్, పుసారమ్ గోదారా, బలరామ్ చౌదరి ఉన్నారు.

కాగా, బీజేపీ నుంచి కుల్దీప్ ధంఖర్ ఈసారి బీజేపీ విరాట్‌నగర్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. హేమ్ సింగ్ భదానా కూడా తనగాజీ నుంచి రెబల్‌గా పోరాడారు. ఈసారి బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ధన్ సింగ్ రావత్, దేవి సింగ్ షెకావత్ కూడా రెబల్స్‌గా పోరాడి రెండో స్థానంలో నిలిచారు. కాగా బన్స్వారా స్థానంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రెబల్ ధన్ సింగ్ రావత్ మూడో స్థానంలో నిలిచారు.

2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు. అయితే రెండు దఫాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ నష్టపోయింది. ఈ విషయంలో బీజేపీ తెలివిగా వ్యవహరించి వారి విజయావకాశాలను దెబ్బకొట్టింది. ఈసారి కూడా అదే జరుగుతుందని కొందరు అంటున్నారు.