CM KCR : పగబట్టిందట, డబ్బు కట్టలు పంపిస్తదట.. వైఎస్ షర్మిలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR Fires On YS Sharmila : పరాయి రాష్ట్రమొళ్లు వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి.

CM KCR : పగబట్టిందట, డబ్బు కట్టలు పంపిస్తదట.. వైఎస్ షర్మిలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR Fires On YS Sharmila (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హీట్ పీక్స్ కి చేరింది. సీఎం కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల డోసు పెంచారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన కేసీఆర్.. తొలిసారి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఓపెన్ అయ్యారు. షర్మిలపై నిప్పులు చెరిగారు కేసీఆర్. సమైక్యవాదులు, పరాయి రాష్ట్రం వాళ్లు అంటూ షర్మిలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు గులాబీ బాస్.

షర్మిల పగబట్టిందట, డబ్బుల కట్టలు పంపిస్తదట..
నర్సంపేట ప్రజాశ్వీరాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ”నర్సంపేటకు ఒక ప్రత్యేకత ఉందన్న కేసీఆర్.. సమైక్యవాదులు, వాళ్ల చెంచాలు వచ్చి రాజ్యం చేస్తామంటే ఇక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పై వైఎస్ షర్మిల అనే ఆమె పగబట్టింద. ఎన్నికల్లో డబ్బు కట్టలు పంపిస్తదట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలనా? మన మిషన్ భగీరథ గెలవాలనా? 24 కరెంట్ గెలవాలనా? మరి ఎవరు గెలవాలి? దయచేసి ఆలోచించాలి” అని కేసీఆర్ అన్నారు.

Also Read : స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ

వాళ్ల చేతిలో ఓడిపోదామా?
పరాయి రాష్ట్రమొళ్లు వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి. ఆరునూరైనా పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గెలవబోతోంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కచ్చితంగా సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి. అప్పుడే లాభం జరుగుతుంది” అని పిలుపునిచ్చారు కేసీఆర్.

KCR Public Meeting

KCR Public Meeting (Photo : Facebook)

అభివృద్ధి కొనసాగాలంటే, పేదల సంక్షేమం ఆగొద్దంటే..
”సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషి. నిత్యం తన నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచన చస్తారు. నర్సంపేటను వదిలి ఎక్కడికీ వెళ్లరు. హైదరాబాద్ రావడం కూడా చాలా తక్కువ. హైదరాబాద్ వచ్చినా ఎక్కువ సేపు ఉండరు. వెంటనే మళ్లీ నర్సంపేటకు బయలుదేరతారు. అలాంటి ప్రజల మనిషిని గెలిపించుకోవాలి.

ఈ పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉంది. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి. పేద ప్రజల కోసం పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న ఈ అభివృద్ధి కొనసాగాలంటే, పేదల సంక్షేమం ఆగొద్దంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలి. ఎన్నికలు వస్తాయి పోతాయి. పార్టీల వైఖరి గురించి ఆలోచించాలి. చాలా పెద్ద ప్రమాదం రాబోతోంది. బాగా ఆలోచన చేసి ఓటు వేయాలి” అని కేసీఆర్ అన్నారు.

Also Read : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో మోదీని గద్దె దించేందుకు పునాది : రేవంత్ రెడ్డి

తొలిసారి కేసీఆర్ నోట షర్మిల మాట..
వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పటి కూడా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. పాదయాత్ర సమయంలోనూ కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా ముందుకు సాగారు. సీఎం కేసీఆర్ నే కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన టార్గెట్ అని చెప్పారు. షర్మిల ఎన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినా.. ఏనాడు కూడా సీఎం కేసీఆర్ స్పందించలేదు.

CM KCR Speech

CM KCR Speech (Photo : Facebook)

అంతేకాదు.. కొంతకాలంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న కేసీఆర్.. షర్మిల గురించి ప్రస్తావించ లేదు. నేరుగా కానీ పరోక్షంగా కానీ షర్మిల గురించి మాట్లాడింది లేదు. అయితే, తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ నోట షర్మిల పేరు వినిపించింది. షర్మిలపై కేసీఆర్ ఓపెన్ అయ్యారు. నర్సంపేట సభలో షర్మిల పేరు ఎత్తిన కేసీఆర్.. పరాయి రాష్ట్రమొళ్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.