Today Headlines : ఉత్కంఠ పోరులో భారత్ సంచలన విజయం

తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Today Headlines : ఉత్కంఠ పోరులో భారత్ సంచలన విజయం

తొలి టీ20లో భారత్ సంచలన విజయం
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ సంచలన విజయం నమోదు చేసింది. ఆస్త్రేలియాపై 2 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 209 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 80 పరుగులతో(9 ఫోర్లు, 4 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ (58) చెలరేడంతో టీమిండియా విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్త్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది.


ఇజ్రాయెల్-హమాస్ మధ్య అతిపెద్ద డీల్

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఖతార్ గురువారం పెద్ద ప్రకటన చేసింది. రేపు అంటే శుక్రవారం నవంబర్ 24 నుంచి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని ఖతార్ తెలిపింది. ఆ సాయంత్రానికి బందీలను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

రూ.100 కోట్ల స్కాంలో నటుడు ప్రకాష్ రాజ్.. సమన్లు పంపిన ఈడీ
పోంజీ పథకం కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు ​​జారీ చేసింది. గతంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ప్రణవ్ జ్యువెలర్స్‌పై ఈడీ దాడులు చేసింది. ఏజెన్సీ ప్రకారం, మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్‌ను ఈడీ ఇప్పుడు విచారించనుంది. ప్రణవ్ జ్యువెలర్స్ కోసం ప్రకాష్ రాజ్ ప్రకటనలు ఇచ్చారు.

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు
విశాఖలో పరిపాలన దిశగా ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయించింది. దీనికి సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శలకు భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు
మోదీ దురదృష్టం వల్లే ఇండియా ఓడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రమం వ్యక్తం చేసింది. ఈ విషయమై రాహుల్ గాంధీకి నోలీసులు పంపిన ఈసీ.. నవంబర్ 25లోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మోదీని పనౌతి (చెడు శకునం), పిక్ పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి రాహుల్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి.

సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ కన్నుమూత
దేశంలోనే తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. ఫతిమా బీవీ ఈరోజు (నవంబర్ 23) కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. దేశవ్యాప్తంగా మహిళలకు ఆమె ఒక ఐకాన్‌గా, న్యాయవ్యవస్థ చరిత్రలో ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. జస్టిస్ బీవీ ఈ లోకం నుంచి నిష్క్రమించడం అత్యంత బాధాకరమని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా, తమిళనాడు గవర్నర్‌గా జస్టిస్ బీవీ తన ప్రత్యేక ముద్ర వేశారు. ధైర్యవంతురాలైన ఆమె ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. సంకల్ప శక్తితో, లక్ష్యసాధనతో ఎలాంటి కష్టనష్టాలనైనా అధిగమించవచ్చని తన జీవితం ద్వారా చూపించిన వ్యక్తి ఆమె.

కొత్త మహమ్మారి
చైనాలో మరో కొత్త మహమ్మారి వెలుగు చూసింది. అంతుచిక్కని న్యుమోనియా ఒకటి వ్యాప్తిస్తోందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని కారణంగా చిన్నారులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

మారాలంటే రావాలి
తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండో రోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిసున్న పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనాని మాట్లాడుతు..  ప్రధాని మోదీపై తనకు అపారమైన నమ్మకముందని.. అందుకే ఆయనతో ఉండాలనుకున్నానని తెలిపారు. తెలంగాణ పోరాట స్పూర్తి దేశం అంతా ఉంటే అవినీతి పోయేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో 65 మంది సీఎంలు వస్తే 25 మంది బీసీలేనని అన్నారు.

అంతా రెడీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 36వేల EVMలు సిద్ధం చేశామని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.

కాంగ్రెస్ వల్ల 58 ఏళ్ల గోస
గతంలో కాంగ్రెస్‌ను గెలిపించి 58ఏళ్లు గోసపడ్డామని, మరోసారి అలాంటి పొరపాటు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే జరిగిది మోసమేనని, తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని ఆయన అన్నారు.

ఎవరి సొమ్ము..?
హైదరాబాద్‌లో ఐదు కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ నగదు ఎవరదని తెలియలేదు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్టన్లు పోలీసులు తెలిపారు.

పవన్ మదిలో గద్దరన్న జ్ఞాపకాలు..
ఈ సంరద్భంగా పవన్ గద్దర్ ను గుర్తు చేసుకుంటు..గద్దరన్న చనిపోయే ముందు ఒకటే కోరాడు అదేమంటే తెలంగాణలో యువతకు అండగా ఉండాలని కోరాడని తెలిపారు.గద్దరన్న ఆశయం కోసం నిలబడుతానన్నారు.సీఎం కేసీఆర్, కేటిఆర్ తో తనకు పరిచయాలున్నాయని..అలాగే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, విహెచ్ తో కూడా పరిచయం ఉన్నాయని..కానీ తన మద్దతు మాత్రం బీజేపీకేనని అలాగే ప్రధాని మోదీకేనని పవన్ మరోసారి స్పష్టంచేశారు. తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టే అభివృద్ధి జరుగుతోందని అన్నారు పవన్ కల్యాణ్.భద్రాద్రి కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న పవన్ గత పాలకులు చేసిన తప్పే BRS చేస్తోంది అని ఆరోపించారు.

వచ్చేస్తారు..!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను కాపాడేందుకు అధికారులు కొనసాగిస్తున్న రెస్క్యూ టీమ్ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. ఈ చర్యలను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టన్నెల్‌లోని కార్మికులతో మాట్లాడారు. ఈరోజు అర్ధరాత్రి లోగా రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసే అవకాశం ఉందని..కార్మికులు క్షేమంగా వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తరకాశీ సొరంగం వద్ద  41 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. సొరంగం నుంచి 41మంది  కార్మికులు బయటకు రాగానే వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. తమ వారి కోసం ఎదురు చూస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులతో ఉత్తరకాశీ టన్నెల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు సొరంగం వద్దకు భారీగా తరలివచ్చారు. తమవారు క్షేమంగా బయటకు వచ్చే క్షణం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. క్షేమంగా బయటకు వచ్చే వారి కోసం బాధితుల బంధువులే కాదు..యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 41మంది కార్మికుల ప్రాణాలు రక్షించేందుకు 12 రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. దీంతో వారి కృషి ఫలించి కార్మికులు ప్రాణాలతో బయటకు రానున్నారు.

మేమే చేశాం..
దుబ్బాక నిధులను హరీశ్‌రావు సిద్దిపేటకు తీసుకెళ్లారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రేవంత్ పలు సభల్లో పాల్గొంటున్నారు.

అభివృద్ధిలో దూకుడు
తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఎదిగింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోందని అన్నారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు అని కోరారు మంత్రి కేటీఆర్. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణమేనని అటువంటి సమస్యలు వస్తే వాటిని అధిగమించి పరిష్కరిస్తామన్నారు.

రేపటికి వాయిదా..
బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. IRR కేసులో CID తరపు న్యాయవాదులు రేపు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

నిధులు విడుదల..
వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేశారు సీఎం జగన్. పేద వర్గాల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు.

మోదీ విమర్శలు..
కాంగ్రెస్‌ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి అంటూ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు సంధించారు.

మట్టుబెట్టారు
రాజౌరిలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోసిన భద్రతాదళలు ఎక్కడిక్కడ మట్టుపెడుతున్నారు. దీంట్లో భాగంగా రాజౌరీలో లష్కరే తోయిబా తీవ్రవాది అంతమొందించారు. అలాగే కోలా కోట్ల అడవుల్లో ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.