Funeral for Monkey : కోతికి అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన కోతుల గుంపు

చనిపోయిన ఓ కోతికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కోతి అంత్యక్రియలకు ఆ కోతికి చెందిన కోతులు గుంపు అంతా వచ్చి అత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాయి. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

Funeral for Monkey : కోతికి అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన కోతుల గుంపు

Funeral for Monkey In bilaspur

Funeral for Monkey In bilaspur : తోటి మనిషికి కష్టం వస్తే సాటి మనిషి తోడు ఉంటాడో ఉండడో గానీ..పశువులు, పక్షులు మాత్రం అలా కాదు. తోటి జంతువుకు కష్టమొస్తే కాపుదలగా ఉంటాయి.తమ జాతికి ఎవరైనా హాని చేస్తే కలిసి కట్టుగా పోరాడతాయి. మనిషిలో మానవత్వం కరువు అవుతున్న ఈరోజుల్లో మానవత్వాన్ని చూపిస్తున్న జంతువుల ఘటనలు సోషల్ మీడియా వేదికగా ఎన్నో చూస్తున్నాం. చనిపోయిన యజమాని కోసం నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూసే కుక్కలు..యజమానికి ఆపద వస్తే ఆదుకునే కుక్కలు..తమ యజమానికి ప్రాణహాని జరిగే సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడే కుక్కల వీడియోలు ఎన్నో..ఎన్నెన్నో..

ఆ జంతువులు ఏ జాతివైనా తమ జాతికి కష్టమొస్తే కన్నీరు కార్చే గుణం వాటికి లేకపోయినా ఆవేదన చెందుతాయి. గాయపడిన ఆ జంతువు పక్కనే ఉండి వాటిని కాపాడేందుకు ఆరాటపడతాయి. తోటి జంతువు చనిపోతే సంతాపాన్ని ప్రకటిస్తాయి. అటువంటి ఓ హృదయ విదారక ఘటన ఛత్తీస్‌గఢ్‌ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది.

మూసీలో మొసలి .. హడలిపోయిన స్థానికులు

బిలాస్‌పుర్‌ జిల్లా కోటా ప్రాంతంలో ఓ కోతి చనిపోయింది. ఆ కోతికి స్థానికులు సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ఘనటలు  చూస్తున్నాం. కానీ.. చనిపోయిన కోతికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహిస్తుంటే ఆ కోతికి చెందిన కోతులు గుంపు అంతా వచ్చి ఆ అత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాయి. ఇది స్థానికంగా సంచలనం కలిగించింది.

కోటా ప్రాంతంలో ఓ కోతి విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తోటి కోతులన్ని ఎంతో బాధపడ్డాయి. అంతేకాదు ఆ కోతికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహిస్తుంటే ..చనిపోయిన కోతికి నివాళులు అర్పించటానికా అన్నట్లుగా కోతులు గుంపు అంతా అక్కడికి చేరుకుంది. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.

చనిపోయిన కోతికి అంత్యక్రియలకు గుంపుగా కోతులు హాజరు కావటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పట్టణంలోని పోస్టాఫీసుకు సమీపంలో ఉన్న హైవోల్టేజీ విద్యుత్తుతీగలు తగిలి ఓ కోతి చనిపోగా..హైందవ సంస్థ సభ్యులు ఆకోతికి అంత్యక్రియలు చేశారు. తోటి వానరానికి అంతిమ వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో అక్కడకు తరలివచ్చిన కోతులు.. పక్కనున్న భవనం మీద వరుసగా కూర్చొని కార్యక్రమం ముగిసేదాకా మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. ఆ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు అక్కడ ఉండి చూస్తుండిపోయాయి.