Today Headlines : పోలింగ్‌కు అంతా సిద్ధం.. ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు

119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.

Today Headlines : పోలింగ్‌కు అంతా సిద్ధం.. ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు

పోలింగ్ డే.. ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు.

పోలింగ్‌కు వరుణ గండం..!
తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో రెండు రోజుల (రేపు, ఎల్లుండి) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.

ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు
సరిగ్గా పోలింగుకు ముందు ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్ అయిన వారిలో సెంట్రల్ జోన్ DCP వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ACP యాదగిరి, ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ ఉన్నారు. వీరు ఉద్దేశపూర్వంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. అయితే ఆరోపణలు అనుకూలంగా ఉండడంతో ఈసీ వారిపై వేటు వేసింది.

జగన్‌ని ఓడించే నాయకుడే లేడు- మంత్రి అంబటి రాంబాబు
ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. ఎంతమంది ఏకమైనా జగన్ ని ఏమీ చేయలేరని, జగన్ ని ఓడించే నాయకుడే లేడని అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన అంటూ విమర్శలు గుప్పించారు. లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసినా ఎప్పటికీ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు.

ద్వేషపూరిత ప్రసంగాలపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
ధ్వేషపూరిత ప్రసంగాలు సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా రాజకీయాల్లో రోజు రోజుకీ ఈ వాతావరణం మరింత పెరిగిపోతుంది. అయితే ఈ ధ్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని రకాల విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని బుధవారం తీర్పు చెప్పింది. ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఫిబ్రవరిలో విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీం.. తాజాగా ఈ వ్యాఖ్య చేసింది.

ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు
మణిపూర్‌లోని చట్టవిరుద్ధమైన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) సుమారు 60 సంవత్సరాలకు తన హింసా పద్దతికి ముగింపు పలికింది. కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. నిషేధిత సంస్థతో చర్చలు పురోగమిస్తున్నాయని గతంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. అతి త్వరలో ఓ పెద్ద అండర్‌గ్రౌండ్‌ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ గగన్ పహాడ్ లో భారీ అగ్ని ప్రమాదం
చోటు చేసుకుంది. ధర్మకోల్ తయారీ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి స్థానికులు అవుతున్నారు.

చైనా మహమ్మారిపై అలర్ట్
చైనా నుంచి వ్యాపిస్తున్న మరో మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఉత్తర చైనాలో అనేక మంది చిన్నారులకు వ్యాపించిన శ్వాసకోశ వ్యాధిపై భారత్ అప్రమత్తమైంది. దేశంలోని దీని వ్యాప్తిని నివారించేలా చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై దేశంలోని ఆరు రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది.

మహిళా బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్న కేంద్రం
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు రానుంది. వ్యవసాయ రంగాన్ని స్మార్ట్ గా మార్చడంలో భాగంగా, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రూపొందించిన పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రైతులకు అద్దె పద్ధతిలో డ్రోన్లను అందించి ఉపాధి పొందేలా పథకాన్ని రూపొందించారు.

కాంగ్రెస్‌ కంప్లైంట్‌
బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ బుధవారం తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారికి ఫిర్యాదు చేసింది. దీక్షాదివస్‌ నిర్వహించడంపై సీఈవోకు ఫిర్యాదు చేసింది.

ఈసీకి ఫిర్యాదు
ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్ అందని అధికారుల్లో ఆందోళన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయమే పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే తమకు పోస్టల్‌ బ్యాలెట్ అందలేదని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేసే అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓటేద్దాం పదండి
ఎన్నికల కోసం నగరవాసులు సొంతూళ్ల బాట పట్టారు. ప్రయాణికులతో బస్టాండ్లు‌, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై సజ్జల క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి సజ్జల క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎలక్షన్స్‌తో పాటే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ముందస్తు వెళ్తారనే ఊహాగానాలు ఇంతటితో చెక్ పడనున్నాయి.

పారిశ్రామిక ప్రగతి
ఏపీలో పలు పరిశ్రమలను ముఖ్యమంత్రి వైయస్ జనగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.

సైలెంట్‌ వార్‌
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఏపీలో నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందని ఆయన అన్నారు.

ముమ్మర ఏర్పాట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం తెలిపారు.

సెలవులు ఇవ్వటంలేదు..
రేపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఓటువంటి శాతం పెరిగేలా ఈసీ చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. ఈక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలకు రేపు సెలవు ఇవ్వడం లేదు అంటూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు అందతున్నాయి. పలు కాలేజీల నుంచి ఈసీ హెల్ప్ లైన్ నంబర్ అయిన 1950 కు కంప్లైంట్స్ చేస్తున్నారు.స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. పోలింగ్ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు చేసింది.EC ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

వెంకయ్యా..గెలిపించయ్యా..
రేపు పోలింగ్ తేదీ రావటంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిర్లామందిర్ లో ప్రత్యేక పూజలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి హైదరాబాద్ నగరంలోని బిర్లామందిర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకన్న ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ కార్డు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మా గెలిపించు..
రేపే పోలింగ్ తేదీ. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాతబస్తీలోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు.

జేడీ కొత్త పార్టీ..
కొత్త పార్టీ పెట్టే యోచనలో జేడీ లక్ష్మీ నారాయణ ఉన్నట్లుగా సమాచారం. విశాఖ నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. జేడీ లక్ష్మీనారాయణ గతంలో జనసేన తరపున పోటీ చేసిన ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఈక్రమంలో ఆయన ఏదోక పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి. ఈక్రమంలో జేడీ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉండటం గమనించాల్సిన విషయం.

కోడ్‌ ఎఫెక్ట్‌
తెలంగాణ భవన్‌లో BRS దీక్షా దివస్ వేడులపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసిది.ఎన్నికల కోడ్ ఉండగా దీక్షా దివస్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల పండుగ కాగా…ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను జరుపుకోవటంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది.  తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారానికి బీజం పడిన రోజు నవంబర్ 29. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు ఈరోజుతో 15 ఏళ్లు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా తెలంగాణ భవన్ లో కూడా దివస్ వేడుకలు జరటంతో ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణను ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడింది. దీంతో ప్రతీ ఏటా గులాబీ దళం నవంబర్ 29న దీక్షా దివస్ ను జరుపుతోంది.

కేటీఆర్ రక్తదానం..
దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రక్తదానం చేశారు.

వేటు పడింది
వరంగల్ అర్భన్ ఎక్సైజ్ సీఐ అంజిత్ రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తుండగా సీఐ అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో ఈసీ సీఐను సస్పెండ్ చేసింది. ఓ పార్టీకి చెందిన అభ్యర్తి తరపున డబ్బులు పంపకాలు చేశారనే ఆరోపణతో ఈసీ సస్పెండ్ చేసింది.

డబ్బే.. డబ్బు
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో ఎలాంటి పత్రాలు లేని రూ. 55 లక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

జనసేనాని దిశానిర్దేశం
డిసెంబర్‌ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఎన్నికలకు పార్టీ శ్రేణుల సమాయత్తంపై జనసేన అధినేత పవన్ కల్యాన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన పవన్ ఇక ఏపీ జనసేనపై ఫోకస్ పెంచారు.

బతుకులు బుగ్గి
విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి KGHలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

తెంపుడుగాళ్లు..
తాడిపత్రిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. దంపతులపై కత్తితో దాడి చేశాడు. మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని బెదిరించాడు.దీంతో ఆమె భర్త అడ్డు రావటంతో ఇద్దరిపైనా కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో దంపతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా మారింది.

సొరంగాన్ని జయించిన కార్మికులకు ఆర్థిక సహాయం
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈసొరంగంలో మొత్తం 41మంది కార్మికులు చిక్కుకుని 17 రోజుల తరువాత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నెరవేరటంతో సురక్షితంగా బయటకొచ్చారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే కార్మికులకు చికిత్సతో పాటు వారు వారి వారి ఇళ్లకు చేరేవరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

భైంసాలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణలో రేపే ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎఫ్ఎస్టీ టీమ్ తో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేస్తు నిరసనలు చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో  పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.  దీంతో రెచ్చిపోయిన కొంతమంది కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు,బీజేపీ కార్యక్రతలకు గాయాలయ్యాయి. దీంతో  అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

సఫాయి కార్మికులకువ్యాక్యూమ్‌ సక్షన్‌ వాహనాలు
సఫాయి కార్మికులకు సీఎం జగన్ వ్యాక్యూమ్‌ సక్షన్‌ వాహనాలు పంపిణీ చేశారు. వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

సాంకేతిక లోపం
స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సిబ్బంది ప్రయాణికులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దించేశారు.

ఈసీ సీరియస్
BRS అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. బలవన్మరణం వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

యువగళం..
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలో జరుగుతోంది. ఈరోజు పాదయాత్రలో డ్వాక్రా మహిళలతో లోకేశ్‌ భేటి కానున్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకోనున్నారు.

వెదర్‌ అప్‌డేట్‌
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

జాలర్లు రిలీజ్‌..
శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసిన భారతీయ జాలర్లు చెన్నై చేరుకున్నారు. 64 మంది జాలర్లను శ్రీలం ప్రభుత్వం విడుదల చేసింది.అలాగే మరో 21 మంది మత్స్యకారులను విడుదల చేయటంతో వారు చెన్నై చేరుకున్నారు.

బెదిరింపు మెసేజ్‌
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పేలిన సిలిండర్‌..కూలిన ఇల్లు..
ముంబైలో గ్యాస్ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ ఘటనాస్థలానికి చేరుకుని 11 మందిని రక్షించింది.

హలో భాయ్..హౌ ఆర్ యు..
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకురావటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  17 రోజులు అంటే తక్కువ సమయం కాదు..శ్రామికులు చూపిన ధైర్యం సాహసోపేతమైంది అని పొగిడారు.

ఎలక్షన్‌ డ్యూటీ..అంతా రెడీ
తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టింది.

చివరి ప్రయత్నాలు
ఇప్పటి వరకు ప్రచారాల్లో మునిగి తేలిన రాజకీయ పార్టీలు ఇక ప్రలోభాల ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఓటర్లను ఆకట్టుకునే యత్నంలో బిజీ బిజీ అయ్యారు. దీంట్లో భాగంగా తెలంగాణలో పోల్‌ మేనేజ్‌మెంట్‌పై పార్టీల దృష్టి పెట్టాయి.

దీక్షా దివస్..
రాష్ట్ర గతిని దీక్షా దివస్ మలుపు తిప్పింది అని అన్నారు.

టీడీపీ ఫిర్యాదు
ఇవాళ టీడీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారిని కలవనున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నారు.

ఓట్ల పండుగకు భారీ భద్రత..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. మూడు కమిషన్ పరిధిలో 70కంపెనీల కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ ఫోర్స్,రూట్ మొబైల్, పెట్రోలింగ్ టీమ్స్ తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలతో భద్రతను ఏర్పాటు చేశారు.మూడు కమిషనరేట్ల పరిధిలో30 వేలమందికిపైగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదు అంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. మూడు కమిషరేట్ల పరిధిలో 1000 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.

తేల్చుకుందాం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకున్నాయి. 119 నియోజకవర్గాల ఎన్నికల బరిలో 2,290మంది అభ్యర్ధులు పోటీలో నిలబడటంతో ఆసక్తి నెలకొంది.  అత్యధికంగా ఎల్బీనగర్ లో 48మంది ఎన్నికల బరిలో ఉన్నారు. గజ్వేల్ లో 44మంది, కామారెడ్డిలో 39మంది ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొడంగల్ లో 13మంది పోటీలో ఉన్నారు. అలాగే సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుపై 21మంది, సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్ పై 21మంది ఎన్నికల బరిలో ఉన్నారు.