Singapore : ఇదేం పెళ్లిరా నాయనా.. కేఎఫ్‌సీ థీమ్ వెడ్డింగ్ అట..

ఇటీవల కాలంలో రకరకాల వెడ్డింగ్ థీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లిలో ఎంచుకున్న వెడ్డింగ్ థీమ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ థీమ్ ఏంటి? చదవండి.

Singapore : ఇదేం పెళ్లిరా నాయనా..  కేఎఫ్‌సీ థీమ్ వెడ్డింగ్ అట..

Singapore

Singapore : జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన వేడుక. జీవితకాలం ఆ రోజు తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వైభవంగా జరుపుకుంటారు. ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ వెడ్డింగ్స్ ట్రెండ్ ఎక్కువైంది. ఈ ట్రెండ్‌లో మరో కొత్త థీమ్ వచ్చి చేరింది. దాని గురించి వింటే ఆశ్చర్యపోతారు.

Viral Video : నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.. తుపాకులతో కాల్పులకు దిగిన రౌడీలను చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ, వీడియో వైరల్

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోని విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తారు. కొందరు గుడిలో.. కొందరు తమకు నచ్చిన ప్రాంతంలో తమ పెళ్లి వేడుకలు చేసుకుంటారు. థీమ్ వెడ్డింగ్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అంటే తాము సెలక్ట్ చేసుకున్న ప్రాంతంలో తాము అనుకున్న థీమ్‌‌తో పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. పెయిరీ టేల్ థీమ్, రాయల్ రాజ్‌పుత్ థీమ్, ఓల్డ్ స్టైల్ వెడ్డింగ్ థీమ్, గ్రీన్ వెడ్డింగ్ థీమ్, ట్రైబల్ వెడ్డింగ్ థీమ్.. ఇలా చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త థీమ్‌తో తమ వివాహ వేడుకను జరుపుకుంది ఓ జంట. మీరు క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఇష్టపడే వారైతే మీకు ఎంతో ఇష్టమైన వార్త ఇది.

Malla Reddy : బాలీవుడ్ పని అయిపోయింది.. తెలుగువారు ఏలబోతున్నారు.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్

ఫేస్ బుక్ యూజర్ లియాంగ్ లే వాంగ్ (Liang Le Wong) తన వాల్ మీద తన డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోల్లో వధూవరులు ఇద్దరు జింగర్ బర్గర్, చికెన్ వింగ్స్ బకెట్‌తో పాటు క్రిస్పీ చికెన్‌లతో ఫోజులు ఇస్తూ కనిపించారు. ఇదే ‘కేఎఫ్‌సీ థీమ్ వెడ్డింగ్ ‘ అన్నమాట. ఈ ఫోటోల్లో పెళ్లి బొకే అందర్నీ ఆకట్టుకుంది. సాధారణంగా బొకేలో వాడే పువ్వులకి బదులుగా డీప్ ఫ్రైడ్ చికెన్ లెగ్‌లతో తయారు చేసారు. వధూవరులిద్దరూ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్‌కి వీరాభిమానులట. పెళ్లికి ఒక నెల ముందే తమ థీమె వెడ్డింగ్ గురించి కొన్ని బ్రాండ్‌లను సంప్రదిస్తే KFC మాత్రమే స్పందించిందట. ఈ బ్రాండ్ వీరి వివాహానికి ఖర్చైన ఫుడ్‌లో సగం భరించిందని న్యూయార్క్ పోస్టు వెల్లడించింది. ప్రస్తుతం లియాంగ్ లే వాంగ్ జంట థీమ్ వెడ్డింగ్ వైరల్ అవుతోంది.