Ben Stokes : బెన్‌స్టోక్స్‌కు ఏమైంది..? చేతి కర్రల సాయంతో నడక..
Ben Stokes knee surgery : ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
![Ben Stokes : బెన్‌స్టోక్స్‌కు ఏమైంది..? చేతి కర్రల సాయంతో నడక.. Ben Stokes : బెన్‌స్టోక్స్‌కు ఏమైంది..? చేతి కర్రల సాయంతో నడక..](https://10tv.in/wp-content/uploads/2023/11/New-Project-12-17.jpg)
Ben Stokes knee surgery
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో స్టోక్స్ రెండు చేతి కర్రల సాయంతో నిలబడి ఉన్నాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు అతడికి ఏమైందోనని కంగారు పడుతున్నారు. కాగా.. స్టోక్స్ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు.
తన శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసిందని, తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సోషల్ మీడియా వేదికగా స్టోక్స్ తెలియజేశాడు. ఈ క్రమంలో ఆస్పత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిలుచున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ‘ఆస్పత్రిలో చేరాను. సర్జరీ జరిగింది. డిశ్చార్జీ అయ్యాను. ఇక కోలుకోవడమే మిగిలి ఉంది. ‘అని ఎక్స్‌లో స్టోక్స్ రాసుకొచ్చాడు.
Najmul Hossain Shanto : అరుదైన జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్.. విరాట్ కోహ్లి, స్మిత్ సరసన
పరిమిత ఓవర్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్ టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. వన్డే ప్రపంచకప్ 2023 ముంగిట కెప్టెన్ జోస్ బట్లర్, టీమ్ మేనేజ్మెంట్ కోరడంతో అతడు రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గి మెగా టోర్నీ ఆడేందుకు వచ్చాడు. అయితే.. గాయం కారణంగా అతడు అన్ని మ్యాచులు ఆడలేదు. ఇక ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు దారుణ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
మెగాటోర్నీ అనంతరం స్టోక్స్ మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ పర్యటన సమయానికి అతడు కోలుకుంటాడో లేదో చూడాల్సిందే..
వదిలిపెట్టిన చెన్నై…
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెన్‌స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ వేలంలో 16.25 కోట్లు వెచ్చింది చెన్నై జట్టు అతడిని సొంతం చేసుకుంది. అయితే.. ఐపీఎల్ 2023 సీజన్లో స్టోక్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. ఇక వచ్చే సీజన్‌కు తాను అందుబాటులో ఉండనని చెప్పడంతో ఐపీఎల్ 2024 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలిపెట్టింది.
In and out
Under the 🔪 done
Rehab starts now 🙌🙌 pic.twitter.com/Lz7Mh3Toh1
— Ben Stokes (@benstokes38) November 29, 2023