Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ డ్రాప్ 3 వచ్చేసింది.. ఈసారి ఎమోషనల్ వెర్షన్..

‘డంకీ’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన షారుఖ్ ఖాన్.. డ్రాప్ 3ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Dunki Drop 3 : షారుఖ్ ఖాన్ ‘డంకీ’ డ్రాప్ 3 వచ్చేసింది.. ఈసారి ఎమోషనల్ వెర్షన్..

Sharukh Khan Taapsee Pannu Dunki Movie second song released

Dunki Drop 3 : పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ ‘డంకీ’. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. డిసెంబర్ 21న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. డ్రాప్ 1 అంటూ టీజర్‌ని, డ్రాప్ 2 అంటూ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు డ్రాప్ 3ని కూడా తీసుకొచ్చారు.

మొదటి సాంగ్ లో లవ్ మూడ్ ని చూపించిన మేకర్స్ రెండో సాంగ్ లో హీరో ప్రయాణంలోని ఎమోషన్‌ని వినిపించారు. ఈ సినిమాలో షారుఖ్ మరియు అతని నలుగురు స్నేహితులు కలిసి ఇంగ్లాండ్ వెళ్లాలనే లక్ష్యం పెట్టుకుంటారు. కానీ వీసా రాకపోవడంతో ఇల్లీగల్ గా ఇంగ్లాండ్ బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో షారుఖ్ తన స్నేహితుల ప్రాణాలను సైతం పోగుట్టుకుంటారు. ఆ ప్రయాణం, వారి స్నేహంలోని ఎమోషన్‌ని తెలిపేలా ఈ సెకండ్ సాంగ్ ఉంది. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, మరో ఇద్దరు బాలీవుడ్ నటులు షారుఖ్ స్నేహితులుగా నటిస్తున్నారు.

Also read : Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. నాన్న ఎమోషన్‌కి మాస్ జోడించి ఏడిపించిన సందీప్ వంగా..

రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కావడంతో బాలీవుడ్ లో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్ గా వస్తుందని టాక్. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఆ వార్త నిజమనే తెలుస్తుంది. ఆ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు డంకీని తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ సినిమా కథ ఏంటంటే.. హీరో తన ప్రియురాలు కోసం దొంగతనంగా అమెరికాకి బయలుదేరి అనేక సమస్యలు ఎదుర్కొంటాడు.