Dinesh Karthik : దంచికొట్టిన దినేశ్‌కార్తీక్‌.. ఆనందంలో ఆర్‌సీబీ అభిమానులు.. !

Dinesh Karthik played supeb knock : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ త‌న‌లో ఇంకా క్రికెట్ మిగిలే ఉంద‌ని చాటి చెబుతున్నాడు.

Dinesh Karthik : దంచికొట్టిన దినేశ్‌కార్తీక్‌.. ఆనందంలో ఆర్‌సీబీ అభిమానులు.. !

Dinesh Karthik

టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ త‌న‌లో ఇంకా క్రికెట్ మిగిలే ఉంద‌ని చాటి చెబుతున్నాడు. పేల‌వ ఫామ్‌తో ఐపీఎల్ 2023లో ఇబ్బంది ప‌డిన 38 ఏళ్ల డీకే తాజాగా జ‌రుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో స‌త్తా చాటుతున్నాడు. త‌మిళ‌నాడు త‌రుపున ఆడుతున్న దినేశ్ కార్తీక్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. బ‌రోడా పై 51 బంతుల్లో 68 ప‌రుగులు చేసిన కార్తీక్ తాజాగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచులో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

ముంబైలోని ఎంసీఏ గ్రౌండ్‌లో శుక్ర‌వారం పంజాబ్‌, త‌మిళ‌నాడు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. మ‌న్‌దీప్ సింగ్ (68),ప్రభసిమ్రాన్ సింగ్ (58), అభిషేక్ శ‌ర్మ (38) లు రాణించ‌డంతో పంజాబ్ 45.2 ఓవ‌ర్ల‌లో 251 ప‌రుగుల‌కు ఆలౌటైంది. త‌మిళ‌నాడు బౌల‌ర్ల‌లో బాబా అప‌రాజిత్ మూడు, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 251 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో త‌మిళ‌నాడు జ‌ట్టు 95 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

IND vs SA : రోహిత్‌, కోహ్లీ ద‌క్షిణాఫ్రికాతో టీ20, వ‌న్డేలు ఎందుకు ఆడ‌డం లేదు.. ఇక వారి కెరీర్ ముగిసిన‌ట్లేనా..?

ఈ ద‌శ‌లో దినేశ్ కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఒంటరి పోరాటం చేశాడు. త‌న జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌యత్నం చేశాడు. దినేశ్ కార్తీక్ మిన‌హా మిగిలిన ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డంతో త‌మిళ‌నాడు 34.2 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. దీంతో పంజాబ్ జ‌ట్టు 76 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

డీకే పై ప్ర‌శంస‌ల వెల్లువ‌..

ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని ప‌క్క‌న బెడితే సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన దినేశ్ కార్తీక్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. దీంతో ఆర్‌సీబీ అభిమానులు ఎంతో ఆనంద‌ప‌డుతున్నారు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు దినేశ్ కార్తీక్‌ను బెంగ‌ళూరు జ‌ట్టు రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ డీకే పై న‌మ్మ‌కం ఉంచింది. డీకే ఫామ్ అందుకున్నాడ‌ని వ‌చ్చే సీజ‌న్‌లో మ‌రోసారి ఫినిష‌ర్‌గా మంచి ఇన్నింగ్స్‌లు ఆడి జ‌ట్టుకు విజ‌యాలు అందిస్తాడ‌ని అభిమానులు ఆనంద ప‌డుతున్నారు.

CPI Narayana : కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలతో మాకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ