Nothing Phone 2 Price Cut : భారత్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి!

Nothing Phone 2 Price Cut : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఆప్షన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone 2 Price Cut : భారత్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి!

Nothing Phone 2 Price in India Gets a Permanent Price Cut

Nothing Phone 2 Price Cut : ప్రముఖ యూకే బ్రాండ్ నుంచి రెండో స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. 2023 ఏడాదిలో జూలైలో భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు, ఆరు నెలల తర్వాత, కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత స్టార్టప్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది.

Read Also : Aadhaar Fraud Warning : మీ ఆధార్ విషయంలో ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదంటే? ఈ 10 విషయాలను తప్పక తెలుసుకోండి..!

ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 39,999కు సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 2 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్ఓసీపై రన్ అవుతుంది. ప్రత్యేకమైన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 4,700ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో నథింగ్ ఫోన్ 2 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2 ధర రూ. 5వేలు తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 39,999కు పొందవచ్చు. ఇందులో బేస్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ. 44,999కు పొందవచ్చు 12జీబీ + 256జీబీ వేరియంట్ అసలు రూ. 49,999 నుంచి ఇప్పుడు రూ.44,999కి కొనుగోలు చేయొచ్చు. అయితే 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీతో టాప్-ఎండ్ మోడల్ అసలు ధర 54,999 నుంచి రూ. 49,999కి తగ్గింది.

Nothing Phone 2 Price in India Gets a Permanent Price Cut

Nothing Phone 2 Price in India 

నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్స్ :
నథింగ్ ఫోన్ 2 మోడల్ డ్యూయల్-సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 13-ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0పై రన్ అవుతుంది. 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ (1,080×2,412 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ద్వారా అడ్రినో 730 జీపీయూ 12జీబీ వరకు ర్యామ్‌తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2 మోడల్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో 1/1.56-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్)తో వస్తుంది. 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 32ఎంపీ కెమెరాను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 2 ప్రత్యేకమైన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇందులో పారదర్శక బ్యాక్ ప్యానెల్ కింద ఎల్ఈడీ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇంకా, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మరియు 45డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 5డబ్ల్యూ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!