Today Headlines : అమరావతే ఏపీ రాజధానని తేల్చి చెప్పిన కేంద్రం.. ఆ దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదట

ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది

Today Headlines : అమరావతే ఏపీ రాజధానని తేల్చి చెప్పిన కేంద్రం.. ఆ దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదట

ఇండియా కూటమికి బిగ్ షాక్
మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఇంటా బయటా కష్టాల్ని తెచ్చి పెట్టింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కాస్తంత సఖ్యతతోనే ఉన్నవారు ఒక్కసారిగా చేయి విదిల్చుకుంటున్నారు. 2024 ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తదుపరి సమావేశం డిసెంబర్ 6న జరగనుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబ్ పేల్చారు. అంతే కాదు.. తనకు రాష్ట్రంలో వేరే షెడ్యూల్డ్ ఉందని, కావున ఈ సమావేశానికి రాలేనని తేల్చి చెప్పారు.

అమరావతే ఏపీ రాజధాని
ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఆ జాబితాలో ఏపీ రాజధానిగా అమరావతి పేరును ప్రస్తావించింది.

ఆ దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదు
జగన్ ని భయపెట్టే దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేశ్ పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకునే అలవాటు చంద్రబాబుకి ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదన్నారు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఈ విషయమై రాజ్ భవన్ లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం కల్పించడం లేదు. రేపటి ప్రమాణ స్వీకారాన్ని సైతం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై డీకే శివకుమార్ సహా తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో సీఎం అభ్యర్థిని ఫైనల్ చేశాకే ప్రమాణ స్వీకారం సమయంపై క్లారిటీ రానుంది.

చెన్నైలో వర్ష బీభత్సంపై కవిత ట్వీట్
చెన్నై నగరంలో వర్ష బీభత్సంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెన్నై నగరవాసులకు సూచించారు. చెన్నై నగరంపై మిచాంగ్ తుపాను ప్రభావం పట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. స్టే స్ట్రాంగ్ చెన్నై.. మేము మీతో ఉన్నాము.. అంటూ ధైర్యం చెప్పారు కవిత.

కార్పొరేషన్ చైర్మన్ల మూకుమ్మడి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మార్పిడీకి మెజారిటీ వచ్చింది. దీంతో బీఆర్ఎస్ అధికారంలో పదవులు చేపట్టిన కార్పొరేషన్ చైర్మన్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం ఏకంగా 15 కార్పొరేషన్ల చైర్మన్లు తమ రాజీనామాలాను ప్రకటించారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.

విగ్రహావిష్కరణ
మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన రాజ్‌కోట్‌ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించారు.

ఇంకా ఉంది..
దేశంలో మూడోసారి విజయం విజయం సాధిస్తామని..హ్యాట్రిక్ కొత్త బోతున్నామని ధీమా వ్యక్తంచేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఐదేళ్లుగా ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని ..కానీ విజయం మాత్రం కాంగ్రెస్ కు దక్కిందన్నారు. ఐనా బీజేపీ ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రణాళిక తయారు చేసుకుంటామని..అసెంబ్లీ వారీగా సమీక్ష చేసుకుని ముందుకెళతామన్నారు.

రీఎంట్రీ
రాజ్యసభలోకి ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా చద్దా సభకు వచ్చారు. ఆయనపై ఛైర్మన్ సస్పెన్షన్‌ ఎత్తివేయటంతో ఆయన సభకు వచ్చారు.

బతుకులు శిథిలం
టాంజానియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 47 మంది మృతి చెందారు.

ఫైర్‌ ఫ్లడ్‌
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 11 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు.

కమల వికాసమే..
తెలంగాణలో ఆశించిన సీట్లు రాకున్నా ఓటింగ్‌ శాతం పెరిగింది..ఇది మంచి పరిణామం. ఇక పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి పెడతాం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.తెలంగాణలో సిట్టింగ్ సీఎంను..కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదే అని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అదీ బీజేపీ ఘనత అని అన్నారు. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.

గవర్నర్‌కు రిపోర్ట్‌
గెలిచిన అభ్యర్థుల జాబితాను వికాస్‌రాజ్‌ గవర్నర్‌కు అందజేశారు. దీంతో కాసేపట్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది.

కస్డడీ పొడిగింపు
ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ కు రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించింది. డిసెంబర్ 11 వరకు కస్టడీని పొడిగించింది.

లోకల్‌ విక్టరీ
మిజోరంలో JPM పార్టీ విజయం సాధించింది. దీంతో సీఎం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు.

స్టూడెంట్‌ ఫైట్‌
పాట్నాలో కాల్పుల కలకలం సృష్టించాయి. రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కాల్పులు జరిగాయి.
స్టూడెంట్‌ ఫైట్‌

మంటల్లో హోటల్‌
ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి.

సీఎం ముహూర్తం ఫిక్స్‌..
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్ధులు, డిప్యూటీ సీఎం అభ్యర్ధులు ఎవరో తేలింది. తెలంగాణ స్వంత రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతోంది. దీని కోసం ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యాయి. సీఎల్సీ సమావేశం పూర్తి అయ్యాక సీఎం,డిప్యూటీ సీఎంలపై క్లారిటీ వచ్చింది. రేవంత్ సీఎంగా..డిప్యూటీలుగా భట్టి, సీతక్క.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. రాజ్ భవన్ లో ఈరోజు రాత్రి 8.15 గంటలకు ముహూర్తం కుదిరింది. దీంతో ఇక రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం కానున్నారు. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు.

మిచాంగ్ ఎఫెక్ట్.. 
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారికి దిశానిర్ధేశం చేశారు. తుపాను పట్ల ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముంచెంతుతున్న మిచాంగ్‌..
మిచాంగ్‌ తీవ్ర తుపానుగా బలపడింది. రేపు బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మిచాంగ్‌ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాలు నీట మునుగుతున్నాయి. విరిగిన చెట్లు.. కూలిన ఇళ్లు.. తో జనజీవనం స్తంభించించిపోయింది. ఈ మిచెంగ్ తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా పడింది. భారీ వర్షాలు ముంచెతుతున్నాయి.

ఓటమిపై రివ్యూ టైమ్..
BRS ఎమ్మెల్యేలు..గజ్వేల్‌కు బయల్దేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమిపై గులాబీ బాస్ ఆదేశం మేరకు చర్చిందుకు KCRను కలవనున్నారు.

మిజోరం తీర్పు
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు విపక్షానికే పట్టం కట్టారు. 27 స్థానాల్లో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ గెలచుకుంది.

పట్టాలపై ప్రమాదం
బెంగాల్‌లో ట్రక్కును ఢీకొని రైలే పట్టాలు తప్పింది.దీంతో రైలు బోగీల్లో మంటలుచెలరేగాయి. కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

వరద పోటు
భారీ వర్షాలకు చెన్నై ఎయిర్‌పోర్టు జలమయమైంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం  కలిగింది.మించాంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం ఏపీమీద కూడా తీవ్రంగా పడింది. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
విషాహారం
చేవెళ్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్ జరిగింది. ఆహారం తిన్న విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు. దీంతోవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

రాజీనామా..
తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని ఆయన తెలిపారు.

కూలిన శిక్షణ విమానం ..
మెదక్ జిల్లా తూప్రాన్ తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో శిక్షణ విమానం కూలింది. దుండిగల్ ఎయిర్ పోర్టు కు చెందిన శిక్షణ విమానంగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు మృతిచెందారు.

కమల వికాసం..
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కమలం వికసించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని సాధించింది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు లెక్కింపు కొనసాగుతోంది.

మూడు రాష్ట్రాల తీర్పుపై..
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. ‘ఘమండియా (అహంకారపూరిత)’ కూటమికి స్పష్టమైన హెచ్చరిక అని ‘ఇండియా’ కూటమిని ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాషాయదళంపై ప్రేమను కురిపించినందుకుగానూ మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీకి మద్దతు లభించిందన్నారు.

ఇండియా కూటమి సమావేశం ..
విపక్ష ఇండియా కూటమి మరోసారి భేటీకి తేదీ, ప్లేస్‌ ఫిక్స్‌ అయ్యింది. ఈనెల 6న ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరుగనున్నట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

తుపాన్‌పై జగన్ సమీక్ష ..
మిచాంగ్‌ తుపానును ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. మిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. పగడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

మంచులో మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టు ..
జర్మనీలోని మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టు పెను మంచుతుపానులో చిక్కుకుపోయింది. ఫలితంగా 760 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరిచినట్లు ప్రకటించినా.. ప్రజలు మాత్రం చూసుకొని ప్రయాణాలను ప్రారంభించాలని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దుబాయ్‌లో పర్యావరణంపై జరుగుతున్న కాప్‌ సదస్సుకు ఉన్నతాధికారులతో బయల్దేరిన ఒక ప్రైవేట్‌ జెట్‌ రన్‌వేపై మంచులో కూరుకుపోయింది.

భారత్‌ విజయం..
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20లో భారత్‌ విక్టరీ కొట్టింది. ఆరు పరుగుల తేడాతో గెలిచింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 161 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో 31 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసిన అక్షర్‌ పటేల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది.